Share News

ఆగమశాస్త్రానికి అనుగుణంగా రాజన్న ఆలయాభివృద్ధి

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:59 PM

): వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాభివృద్ధిని ఆగమ శాస్ర్తానికి అనుగుణంగా చేపడుతున్నామని, ప్రతి విష యంలో శృంగేరి పీఠాధిపతుల నిర్ణయంతోనే ముందుకు సాగుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఆగమశాస్త్రానికి అనుగుణంగా రాజన్న ఆలయాభివృద్ధి

వేములవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాభివృద్ధిని ఆగమ శాస్ర్తానికి అనుగుణంగా చేపడుతున్నామని, ప్రతి విష యంలో శృంగేరి పీఠాధిపతుల నిర్ణయంతోనే ముందుకు సాగుతున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలో సిరిసిల్ల కో-ఆపరేటివ్‌ అర్బన్‌బ్యాంక్‌ నూతన శాఖ, వీరశైవ అన్న దాన సత్రం ప్రారంభ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశాల్లో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆలయాభి వృద్ధి విషయంలో భక్తుల్లో ఉన్న అనుమానాలు, అపోహా లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ ప్రాచీనత, చారిత్రక వైభవం, ఆగమశాస్త్ర సంప్రదాయా లకు విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపడు తున్నామని స్పష్టం చేశారు. హెరిటేజ్‌ కన్సల్టెంట్‌, శృంగే రి పీఠం పెద్దలు, ఆధ్మాత్మిక నిపుణుల సూచనలు, సల హాలు, నిబంధనలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయ నిర్మాణాన్ని గర్భాలయా న్ని ఎక్కడా తాకకుండా చుట్టుపక్కల ప్రాంతాలను అభి వృద్ధి చేస్తున్నామని చెప్పారు. భక్తుల దర్శనాలు, నిత్య సేవలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటు న్నామని, భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రూ.6.50 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వేముల వాడ క్షేత్రంలో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి వీరశైవ సంఘం నాయకులు, సభ్యులు ముందుకు రావ డం అభినందనీయమన్నారు. సనాతన ధర్మం, హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరా లకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద న్నారు. లోకకల్యాణం కోసం వివిధ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహిస్తున్న పూజ కార్యక్రమాలు, ధార్మిక సేవలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

ఖాతాదారులు విశ్వాసంతో ముందుకు సాగాలి

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు

ప్రజలకు ఉత్తమ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తూ ఖాతాదారుల విశ్వాసంతో ఉద్యోగులు ముందుకు సాగాలని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ప్రారంభోత్స వానికి సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్ర పాణితో కలిసి రవీందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భం గా రవీందర్‌రావు మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ వేముల రాములు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ అడిచర్ల సాయికృష్ణ, నాయకులు ఎండీ సత్తార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 11:59 PM