Share News

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చెరువుల అభివృద్ధి

ABN , Publish Date - May 01 , 2026 | 12:51 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరు వులు, కుంటలను, నాలాలకు పునరుజ్జీవం కల్పించి ఆధ్యాత్మికత ఉట్టి పడేలా అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చెరువుల అభివృద్ధి

వేములవాడ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరు వులు, కుంటలను, నాలాలకు పునరుజ్జీవం కల్పించి ఆధ్యాత్మికత ఉట్టి పడేలా అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి గుడి బండ చెరువు సుందరీకరణ పనులకు గురువారం శంకుస్థానన నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముసీనది ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు. అం దులో భాగంగానే నాంపల్లి చెరువు సుందరీకరణ పనులకు అంకురా ర్పణ చేశామన్నారు. నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి వారి గుట్ట పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని, పర్యాటకులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులు సేదతీరే అవకాశం ఉందన్నారు. రాజన్న ఆలయ అభివృ ద్ధిని రూ.150 కోట్లతో చేపడుతున్నామని, పనులు వేగంగా జరుగుతు న్నాయన్నారు. వేములవాడ గుడి చెరువు, మూలవాగులో మురికి నీరు కలవకుండా రూ.10కోట్లతో పైపులైన్‌ నిర్మాణం చేపడుతామని, పట్టణం లో రూ.16కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో కబ్జాకు గురైన చెరువులను కుంటలను కాపాడుతు న్నామని, పట్టణ సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు,వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్‌ కాశ శ్రీనివాస్‌, మార్కె ట్‌ కమిటీ డైరేక్టర్‌ రాగిరి నాగరాజు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకు లు బొజ్జ భారతి, చిలివేరి శ్రీనివాస్‌, తుమ్మ ప్రశాంత్‌రెడ్డి, దండుగుల తిరుపతి, పల్లపు రాజేందర్‌, జడల రవీందర్‌, చిలివేరి సత్తయ్య, పోచ వేని నాగరాజు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:51 AM