రైతుల భాగస్వామయంతోనే సహకార సంఘాల అభివృద్ధి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:21 AM
రైతుల భాగస్వామ్యంలోనే సహకార సంఘాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పీఏసీఎస్ కార్యాలయంలో సహకార వారోత్సవాలు, రైతు ఉత్పత్తి దారుల సంస్థ సభ్యత్వ స్వీకరణ, అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
గంగాధర, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రైతుల భాగస్వామ్యంలోనే సహకార సంఘాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పీఏసీఎస్ కార్యాలయంలో సహకార వారోత్సవాలు, రైతు ఉత్పత్తి దారుల సంస్థ సభ్యత్వ స్వీకరణ, అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో రామానుజచార్యులు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాలను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 వేల సహకార సంఘాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో గంగాధర సహకార సంఘం ఉందన్నారు. ఎఫ్‌పీవో కింద ప్రభుత్వ సహకార సంఘానికి ఆరు లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. రైతుల నుంచి వాటాధనం స్వీకరించి, వారి భాగస్వామ్యంలో పెట్రోల్ పంపు, రైస్ మిల్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని ప్రారంభించవచ్చన్నారు. అనంతరం పలువురు రైతుల నుంచి వాటా ధనం స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాధర పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్, గంగాధర పీఏసీఎస్ సీఈవో గాలిపెల్లి రమేష్, ఉమ్మడి జిల్లా ఎఫ్‌పీవో అశోక్ పాల్గొన్నారు.