Share News

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి..

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:23 AM

తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని, కానీ తెలంగాణకు అన్యాయం చేస్తుందం టూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పచ్చి అబద్దాలు ఆడు తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి..

సిరిసిల్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని, కానీ తెలంగాణకు అన్యాయం చేస్తుందం టూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు పచ్చి అబద్దాలు ఆడు తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో అమృత్‌ 2.0 పథకంలో రూ.1.32 కోట్లతో సిరిసిల్ల కార్గిల్‌ లేక్‌ పునరు ద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్గిల్‌ యుద్ధ ట్యాంక్‌ను సందర్శించి కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. కలెక్టర్‌, ఎస్పీ మహేష్‌ బీ గీతే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ చక్రపాణి, కమిషనర్‌ ఖదీర్‌పాషా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్వరూపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రం వెంకట్రాజం, కౌన్సి లర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో బండి సంజయ్‌ మాట్లాడుతూ అమృత్‌ 2.0 స్కీం కింద రూ1.32 కోట్లతో కార్గిల్‌ చెరువు పునరుద్ధ రణ, సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరు వును సందర్శించేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా మన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా నయాపైసా ఇవ్వలేదని, మోదీ ప్రభుత్వం వివిధ స్కీంల కింద నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు. సిరిసిల్ల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని, రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిరిసిల్లకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ తమ ప్రభుత్వం లేకపోయినా మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధి చేస్తామని తమకు అప్పగించాలని మైౖకుల్లో ఊకదంపు డు ఉపన్యాసాలు ఇచ్చారని, నిధులేవని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కుంటి సాకులు చెప్పవ ద్దన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ గెలిచిందని అర్బన్‌ ఛాలెంజ్‌ కింద రూ.840 కోట్లు, యూడీఎఫ్‌ కింద రూ.50 కోట్లు నిధులతో పాటు అదనంగా మరో రూ.30 కోట్లు తెచ్చుకుందన్నారు. స్మార్ట్‌సిటీ కింద రూ.70కోట్లు విడుదల చేయించుకున్నామని అన్నారు. సిరిసిల్లకు యూడీఎఫ్‌ కింద రూ.18 కోట్లు వస్తే పనులు మొదలు కాలేదన్నారు. కేంద్రం ప్రభుత్వం గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్‌ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు బెది రించి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు, నిధుల మళ్లింపు నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చు కోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామపం చాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలి స్తామని అన్నారు. గ్రామ పంచాయతీల కరెంట్‌ బిల్లులు, సిబ్బంది.జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభు త్వం అమృత్‌ పథకంలో పెద్ద ఎత్తున నిధులిస్తున్నా గడువులోగా పనులు చేయడం లేదని అన్నారు. దీనివల్ల నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముందని అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తోపాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు అమృత్‌ పథకం కింద దాదాపు కేంద్రం రూ400 కోట్లు కేటాయించిందన్నారు. అందులో సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.105 కోట్ల 57లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు ఇస్తుందని అన్నారు. 12 ఏళ్లలో రూ 13 లక్షల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా తప్పుడు నివేదికలే ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం 2.60 లక్షల ఇండ్లు ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం 2 లక్షల 50 వేలు ఇల్లు ఇచ్చిందని చెప్పారని. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని లేఖ రాస్తే ఇవ్వలేదన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రం వెంకట్రాజం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, బీజేపీ పట్టణ అధ్య క్షుడు శ్రీకాంత్‌, ముస్తాబాద్‌ సర్పంచ్‌ వెంకటరమ ణారెడ్డి, బిజెపి నాయకులు తిరుపతి రెడ్డి, శీలం రాజు, బర్కం లక్ష్మీ మ్యాన రాంప్రసాద్‌, కౌన్సిలర్లు మేర్గు మం జుల, ఊరకొండ లక్ష్మీ, మామిడాల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం నాయకుల సన్మానం..

జిల్లా కేంద్రంలోని కార్గిల్‌ లేక్‌ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను సిరిసిల్ల పద్మశాలిసంఘం అధ్యక్షుడు గాజుల శంకర్‌, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షుడు గాజుల బాలయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు మార్కండేయ చిత్రప టాన్ని అందజేసి సత్కరించారు. మార్కండేయ గుడి నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Updated Date - Jul 18 , 2026 | 12:23 AM