కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి
ABN , Publish Date - May 28 , 2026 | 12:47 AM
కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆర్నకొండలో ఆర్నకొండ-మల్యాల డబుల్ రోడ్ విస్తరణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
చొప్పదండి, మే 27 (ఆంధ్రజ్యోతి): కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆర్నకొండలో ఆర్నకొండ-మల్యాల డబుల్ రోడ్ విస్తరణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలో కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, సర్పంచ వడ్లూరి లక్ష్మి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కరీంనగర్ రూరల్: ధాన్యం కొనుగోళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. బొమ్మకల్‌లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్మే బాల్క సుమన చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు.
మండలంలోని ఇరుకుల్లలో సీసీ రోడ్డు పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంబించారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటి మేయర్ సునీల్ రావు, ఎంపీడీవో అశోక్, ఎంపీవో జగన్మోన రెడ్డి, కార్యదర్శి అభినవ్, సర్పంచ రమేష్ గౌడ్, 4వ వార్డు కార్పోరేటర్ భూపతి రవీందర్ పాల్గొన్నారు.
కూలిన ఇళ్లకు తక్షణ ఆర్థిక సాయం
అకాల వర్షాలతో కరీంనగర్‌లో కూలిన ఇళ్లకు తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం కరీంనగర్ శివారు బొమ్మకల్ వడ్డెర కాలనీలో కూలిన ఇళ్లను ఆయన పరిశీలించారు.