విద్యారంగ అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:07 AM
ప్రభుత్వ బడుల్లో చదువుకు ని సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డి విద్యా రంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
ఎల్లారెడ్డిపేట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో చదువుకు ని సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డి విద్యా రంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించి గ్రామీ ణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేటు స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల ప్రగతిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, సర్పంచ్ గీతాంజలితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు పక్క ప్రణాళికతో అడుగులు వేస్తోందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్, స్కిల్, క్రీడా యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తాను ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. బడి ఎంతో మంది విద్యార్థులకు ధైర్యం ఇవ్వడంతో పాటు ఉన్నత స్థానాలకు చేర్చిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, ప్రణాళికబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని అన్నారు. చదువుతో పాటు సామాజిక స్పృహా కలిగి ఉండాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, నీటి వృధాను అరికట్టేందుకు విద్యార్థులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాను అందజేశారు. ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈవో జగన్మోహన్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌శర్మలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.