అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:27 AM
శాతవాహన విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో చేపడుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, చెట్ల నరికివేతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్‌యూ జేఏసీ నాయకులు కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు.
గణేశ్‌నగర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శాతవాహన విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో చేపడుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, చెట్ల నరికివేతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్‌యూ జేఏసీ నాయకులు కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎస్‌యూ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండు ఎకరాల విస్తీర్ణంలో పది అడుగులకు పైగా లోతుతో తవ్వకాలు చేపట్టి విలువైన మట్టిని, ఎన్నో ఏళ్ల నాటి చెట్లను తొలగిస్త్తున్నారని తెలిపారు. ఈ చర్యలతో క్యాంపస్‌లో పచ్చదనం, సహజ పర్యావరణం దెబ్బతింటున్నాయని, నెమళ్లు సహా పలు పక్షులు, వన్యప్రాణుల ఆవాసాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ఇవన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా అని సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌యూ జేఏసీ చైర్మన్ కారికే మహేష్, అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్‌ఎఫ్ కన్వీనర్ శివాజీ, లక్ష్మణ్ సాయి,ఉపాధ్యక్షుడు శ్రీధర్, లైబ్రరీ ఇన్‌చార్జి శంకర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు ఓంప్రకాష్ పాల్గొన్నారు.