Share News

21న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పర్యటన

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:37 AM

ధర్మపురి మం డలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ నెల 21న ధర్మపురి మండలంలో పర్యటిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

21న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పర్యటన
ధర్మపురిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి మం డలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ నెల 21న ధర్మపురి మండలంలో పర్యటిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రభుత్వ అధికారుల తో కలిసి ఆయన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభ, శంకుస్థాపనలు చేస్తారని ఆయన అన్నారు. ధర్మపురి ప్రాంతంలో ప్రభు త్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బం దుల గురించి సీఎం రేవంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లామ న్నారు. దీంతో పలు అభివృద్ధి పనులకు నిధులు మం జూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇందులో భా గంగా రూ 200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం, గోదావరి నదిలో మురికి నీరు కలుషితం కాకుండా రూ. 17 కోట్లతో సీవరేజి ట్రీట్‌ మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ) ఏర్పాటు కోసం శంకుస్థాప న చేస్తారన్నారు. టీయుఎఫ్‌ఐడీ ద్వారా రూ.15 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరిం చారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత వైర్ల మార్పు, కొత్త స్తంభాల ఏర్పాట్లు కోసం నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారం భించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నా రని మంత్రి అడ్లూరి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన, ఎనపీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శన, పీఆర్‌ ఈఈ లక్ష్మణ్‌రావు, పబ్టిక్‌ హెల్త్‌ ఈఈ సంపత రావు, పీఆర్‌, ఎనపీడీసీఎల్‌ ఆపరేషన, కనస్ట్రక్షన, పబ్లిక్‌ హెల్త్‌ డీఈఈలు గోపాల్‌, గంగారాం, గోపికృష్ణ, వరుణ్‌, మైనార్టీ, ఎస్సీ ఎస్సీ వెల్‌ఫేర్‌ అధికారులు చిత్రు, రాజ్‌కు మార్‌, ఏఈ సాయినాథ్‌, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:37 AM