Share News

డిపో అభివృద్ధిలో ముందుండాలి

ABN , Publish Date - May 06 , 2026 | 12:28 AM

ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ముందుండాలని ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావు అన్నారు.

డిపో అభివృద్ధిలో ముందుండాలి

సిరిసిల్ల టౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ముందుండాలని ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎస్సీ, ఎస్టీ రీజినల్‌ కార్యదర్సి దొంతు రాజన్న ఆధ్వర్యంలో జరిగిన సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎస్సీ, ఎస్టీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీ ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు ధుమాల ప్రసాద్‌, కోశాధికారి రఘనాయక్‌, కార్యదర్శి జలధర్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు జి మల్లేష్‌, కె పతి, మహిళా విభాగం కార్యదర్శులు సుమలత, నిర్మల, పద్మ, కాలేశ్వరి, చీఫ్‌ అడ్వయిజర్‌ ఎంపీ కుమార్‌, ముఖ్య సలహాదారులు బాణయ్య, రవీందర్‌, సంతోష్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు సిరిసిల్ల డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావును మర్యాద పూర్వకంగా కలవగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రావు మాట్లాడుతూ నూతన కమిటి డిపో అభివృద్ధికి సహకరించాలని, సమస్య లను తమ దృష్టికి తీసుకురావలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిటీ నాయకుడు జీపీ సింగ్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:28 AM