అడుగంటుతున్న భూగర్భ జలాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:35 AM
మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుతుం డటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుతుం డటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందని, వరి పంటను సాగు చేయవద్దని అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసినా రైతులు సాగుచేశారు. మండలంలో 18,600ఎకరాల విస్తీర్ణంలో వరిపంటను సాగుచేశారు. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా భూగర్భ జలాలు పెరగలేదు. మండలంలోని వంతడుపుల, తెనుగువాని పల్లె, వల్లంపట్ల తదితర గ్రామాల్లో సరైన నీరు అం దక వరిచేన్లు ఎండిపోతున్నాయని రైతులు పేర్కొం టున్నారు. మధ్యమానేరు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే పంటలు కాపాడుకోవచ్చని రైతులు పేర్కొంటూ ఇప్పటికే రెండుసార్లు నిరసన కార్యక్రమా లు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం ప్రాజె క్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొంటున్నారు.