Share News

పల్లగుట్టను కూల్చడం పర్యావరణాన్ని దెబ్బతీయడమే..

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:22 AM

పల్లగుట్టను కూల్చడం.. పర్యావరణాన్ని దెబ్బతీయడమేనని, పల్లగుట్ట తవ్వకాల లీజును రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు.

పల్లగుట్టను కూల్చడం పర్యావరణాన్ని దెబ్బతీయడమే..

ముస్తాబాద్‌ (గంభీరావుపేట), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పల్లగుట్టను కూల్చడం.. పర్యావరణాన్ని దెబ్బతీయడమేనని, పల్లగుట్ట తవ్వకాల లీజును రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ముస్తాబాద్‌ మండ లం గూడూరు-నామాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న పల్లగుట్టను బుధవారం చాడ వెంకట రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య ప్రకృతి పై కనెర్ర చేసినా బడాబడా వాణిజ్య వాపార వేత్తలు గుట్టలను ధ్వంసం చేస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్నారన్నారు. అంబా నీ, అదానీ వంటివారు లక్షల కోట్ల శ్రీమం తు లు ఆయ్యారంటే సహజ వనరులను కొల్లగొ ట్టడం వల్లేనని పేర్కొన్నారు. తక్కువ ధరకు తీసుకుని కొట్లకొద్దీ డబ్బులు సంపాదించటాని కి పల్లగుట్టను బడాబాబులు లీజుకు తీసుకు న్నారన్నారు. గుట్టకు ఒకవైపు గుడి, మరోవైపు దర్గా ఉందని, 108ఎకరాల విస్తీర్ణంలో 60 ఎక రాలు కుల వృత్తులకు సంబంధించి పట్టాలు ఇచ్చారన్నారు. దీనిపై వెంకట్‌రెడ్డి అనే బడా కాంట్రాక్టర్‌కు గతంలోనే కన్ను పడిందని, అప్పట్లో ఎర్రజెండ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు తిరగబడ్డారని గుర్తుచేశారు. దీంతో బడా కాం ట్రాక్టర్‌ వెనక్కి తగ్గాడని, పట్టుబట్టిన విక్రమా ర్కుడిలా మళ్లీ అదే వెంకట్‌రెడ్డి లీజుకు తీసు కున్నాడన్నారు. రంగురాళ్ళను తవ్వి కోట్ల వ్యా పారం చేసేందుకు గుట్టను ధ్వంసం చేస్తున్నా డన్నారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రజ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ఉద్యమిస్తు న్నారని, వారికి తమ పార్టీ వెన్నంటి ఉండి పోరాటాన్ని మరింత విస్తరిస్తామన్నారు.

మంత్రి వివేక్‌కు విన్నపం..

పల్ల గుట్ట ధ్వంసం వల్ల రెండు గ్రామాల ప్రజలు నివసించకుండా చేయడంతో పాటు వారి బ్రతుకులు బజారుపాలు చేయడమేన న్నారు. పల్లగుట్ట ధ్వంసం చేయడంపై ఈ ప్రాంత నాయకులు తన దృష్టికి తేవడం తో గనుల శాఖ మం త్రి వివేక్‌ వెంకటస్వా మికి వివరించామన్నా రు. మంత్రి స్పందిం చి, విజిట్‌ చేయాలని సంబంధిత శాఖకు సూచించారన్నారు. లీజును రద్దు చేసే వరకు పోరాటం చే యాల్సిందేనన్నారు. పర్యావరణం పరిర క్షించే అంశమని, ప్ర జల బ్రతుకుదెరువుకు సంబంధించిన విషయమ న్నారు. ఇదేచోట 60ఎకరాల్లో కుల వృత్తుల వారికి పట్టాలు ఇచ్చారని, పల్లగుట్ట కూల్చి పేదల కడుపు కొడతారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పల్లగుట్ట లీజును రద్దు చేసిం దని, ఈ ప్రభుత్వం కూడా రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట గూడూరు మాజీ సర్పంచ్‌ సాకలి రమేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి సుదర్శన్‌, జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, సీపీఐ కార్యవర్గ సభ్యులు పం తం రవి, కడారి రాములు, గీస బిక్షపతి, చెరు కు ఎల్లం, కిషన్‌, పల్లగుట్ట గ్రామ పరిరక్షణ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:22 AM