Share News

మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లు

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:27 AM

కేంద్ర ప్రభుత్వ క్యాబి నెట్‌ మహిళా శక్తి-నారీ శక్తి ముసు గులో డీలిమిటేషన్‌ బిల్లును తీసుకొ చ్చిందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లు

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ క్యాబి నెట్‌ మహిళా శక్తి-నారీ శక్తి ముసు గులో డీలిమిటేషన్‌ బిల్లును తీసుకొ చ్చిందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు విరోధులని రెండు బిల్లులను అడ్డుకున్నాయని, తమను ప్రజలు క్షమించాలని ప్రధాన మం త్రి మోదీ కల్లబొల్లి మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలన్ని ఏకమై పార్లమెంట్‌లో రెండు బిల్లు లను అడ్డుకొని 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బన్నారు. 2023లోనే మహిళా బిల్లును కాంగ్రెస్‌ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏక కంఠంతో బిల్లును పాసు చేయడం జరిగిందన్నారు. 2024లో ఆ బిల్లును అణగదొక్కి కులగణన, జనగణన చేయకుండా ఆపింది బీజేపీ ప్రభుత్వ మే అని ఆరోపించారు. పాతపద్ధతిలో బిల్లును తీసుకొస్తే తప్పనిసరిగా ప్రతిపక్షాలను ఒప్పించడానికి కృషి చేస్తామని రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పడం జరిగిందన్నారు. జనగణన, కులజనగణన చేపట్టి పునర్‌విభజన బిల్లును పెట్టాల్సి ఉండేదన్నారు. ఒప్పుకుంటే ఓరకం ఒప్పుకోకుంటే ఓ రకం బిల్లును పెడుతామనే వారి కుయుక్తులను దేశం అంతా గమనిస్తోందన్నారు. 33 శాతం మహిళా బిల్లును 2023లో ఏకపక్షంలో బీజేపీ ప్రభుతానికి బిల్లును అప్పజెప్పి తే బీజేపీ ప్రభుత్వం ఏంచేయలేదని ఆక్షేపించారు. మహి ళలను రాజకీయం ముందుకు తీసుకురావాలని రాజకీయం గా ప్రధాన్యత ఇవ్వాలనుకుంటే ప్రధాన మంత్రి మోదీ 2024లోనే ఆ అవకాశం కల్పించాల్సి ఉండేదన్నారు. అది పక్కన బెట్టి 2029 ప్రణాళికతో ముందుకు వచ్చి ప్రజలకు ముసుగువేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. మహిళ లను గౌరవించిన పార్టీ ఉందంటే అది ఒక కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్‌లో మంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్‌లు, ముఖ్యమంత్రులను మహిళలను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నా రు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో భారత రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని అతలాకుతలం చేయాలని చూస్తుందని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. పాత పద్ధతిలో బిల్లును ప్రవేశపెట్టండి.. బిల్లుకు మద్దతునిస్తామని కాం గ్రెస్‌, ప్రతిపక్షాలు చెప్పాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. ఈ సమా వేశంలో సిరిసిల్ల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్‌, వేముల దామోదర్‌, కార్యదర్శులు సామాల రోజ, చొక్కాల రాము, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు కూర శ్రీశైలం, వెంగళ లీలా, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ వెంగళ లక్ష్మీనర్సయ్య, నాయకులు కంసాల మల్లేశం, ఇప్పపుల్ల లక్ష్మన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:27 AM