విద్యా శాఖ పదోన్నతుల్లో జాప్యం
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:00 AM
రాష్ట్ర విద్యా శాఖలో పదో న్నతుల్లో జాప్యం అవుతోందని, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంను 5-10, 15-20, 25-30 సంవత్సరాలుగా ఉండేలా పీఆర్‌సీ కమిషన్‌కు ప్రతి పాదనలు చేశామని పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామో దర్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యా శాఖలో పదో న్నతుల్లో జాప్యం అవుతోందని, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంను 5-10, 15-20, 25-30 సంవత్సరాలుగా ఉండేలా పీఆర్‌సీ కమిషన్‌కు ప్రతి పాదనలు చేశామని పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామో దర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం పద్మనాయక కళ్యాణ మండ పంలో పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పీఆర్ టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా పీఆర్‌టీయూటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ వార్షిక నివేదికను సమర్పించగా, 13 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు నివేదికపై చర్చించిన అనంతరం ఆమోదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లా డారు. 2003 డీఎస్సీ వారికి పాత పెన్సన్ త్వరలో అమల్లోకి వస్తుంద న్నారు. సీపీఎస్ విధానం రద్దు అయ్యేలా కమిటీకి వివరిస్తామన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలో పరిపాలన పరమైన, సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి త్వరలో విజయ వంతంగా అమలు చేయిస్తామని హామీనిచ్చారు. ప్రాథమిక పాఠశాలలో జీవో నంబర్ 25ను సవరించిన త్వరాతే వేసవిలో పదోన్నతలు, బదిలీలు జరిగేలా చూస్తామని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటి తత్వంతో పని చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయా లని సూచించారు. అనంతరం 2026-28 కాలానికి గాను పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా నూతన కార్యవర్గంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మాడిశెట్టి మహేష్, జక్కని నవీన్, మహిళ అసోసియేట్ అధ్యక్షులు కైరి పద్మ,అనూష యశస్విని, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బాబు, గుర్రం దేవదాస్, ఎర్ర ప్రవీన్‌కుమార్, అరికల బాల్‌రెడ్డి, గంప మధుకర్, మహిళ ఉపాధ్యక్షులు రమ, కార్యదర్శులు ప్రశాంత్, శర త్‌కుమార్, మహేష్, శంకర్, మహిళ కార్యదర్శులు వకుళ, అడెపు కీర్తిల ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గసభ్యులతో ఎన్నికల అధి కారి ప్రమాణస్వీకారం చేయించారు. నూతన జిల్లా కార్యవర్గం సభ్యులను రాష్ట్ర అధ్యక్షుడు, నాయకులు, సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూటీఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి నరహ రి లక్ష్మారెడ్డి, గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కరీంనగర్ పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షుడు ముస్కు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ, మెదక్ జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సామ్యానాయక్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌శర్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.