తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన దీక్షా దివస్
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:46 AM
ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు దిక్షా దివస్ అని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ పేర్కొ న్నారు.
ఇల్లంతకుంట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా జరుగుతున్న ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు దిక్షా దివస్ అని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ పేర్కొ న్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యా లయంలో మంగళవారం మండల శాఖ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి వినోద్‌కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించార న్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డ దిక్షా దివస్‌ను గుర్తుంచుకో వాలనే లక్ష్యంతో సమావేశాన్ని అల్గునూరులో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో పెట్టిన బిక్ష కాదని, అనేక మంది అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాలలో విఫలం చెందిందని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు ఈనెల 29న జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్య క్షుడు జీవీ రామకృష్ణరావు, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, నాయకులు రాజిరెడ్డి, గొడుగు తిరుపతి, ముత్తయ్య, ఒగ్గు నర్సయ్యయాదవ్, ఉడుతల వెంకన్న, శేఖర్‌రెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి, బొల్గం వెంకటేశం, సావనపెల్లి అనీల్‌కుమార్, రాగటి రమేష్, రడం ప్రవీణ్, కూనబోయిన రఘు, మీసరగండ్ల అనీల్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాగరాజులతో పాటు వివిధ గ్రామా ల నాయకులు పాల్గొన్నారు.