Share News

తగ్గిన రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:51 AM

వ్యవసాయ భూములు, ప్లాట్లు, వాణిజ్య ఆస్తుల మార్కెట్‌ విలువ పెంచిన ధరలను ఈ నెల 5 నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో అమ్మకాలు, రిజిష్ట్రేన్ల లావాదేవీలు తగ్గిపోయాయి. జిల్లాలోని మూడు రిజిస్ట్రేషన్‌ కార్యాల యాలు, తహసీల్ధారు కార్యాలయాల్లో వారం రోజుల క్రితం కనిపించిన రిజిస్ట్రేషన్ల సందడి లేకుండా పోయింది. భూము లు, ఫ్లాట్ల కొనుగోలు అమ్మకాల్లో స్తబ్ధత నెలకొన్నది. కేవలం గిఫ్ట్‌ డీడ్‌ల రిజిస్ట్రేషన్లు, బ్యాంకుల అవసరాల కోసం చేసుకునే రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి.

తగ్గిన రిజిస్ట్రేషన్లు

- భూముల విలువ పెంపుతో ప్రభావం

- బ్యాంకు లావాదేవీలకే పరిమితం

- వ్యవసాయ సీజన్‌ కావడంతో తగ్గాయంటున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వ్యవసాయ భూములు, ప్లాట్లు, వాణిజ్య ఆస్తుల మార్కెట్‌ విలువ పెంచిన ధరలను ఈ నెల 5 నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో అమ్మకాలు, రిజిష్ట్రేన్ల లావాదేవీలు తగ్గిపోయాయి. జిల్లాలోని మూడు రిజిస్ట్రేషన్‌ కార్యాల యాలు, తహసీల్ధారు కార్యాలయాల్లో వారం రోజుల క్రితం కనిపించిన రిజిస్ట్రేషన్ల సందడి లేకుండా పోయింది. భూము లు, ఫ్లాట్ల కొనుగోలు అమ్మకాల్లో స్తబ్ధత నెలకొన్నది. కేవలం గిఫ్ట్‌ డీడ్‌ల రిజిస్ట్రేషన్లు, బ్యాంకుల అవసరాల కోసం చేసుకునే రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచకపోయినా భూములు, ఆస్తుల విలువలను పెంచడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని కొన్ని గ్రామాల్లో, ప్రాంతాల్లో ప్రభుత్వ విలువ కంటే తక్కువ ధరకు అమ్మినా కొనే వారు లేకుండా పోతున్నారని అంటున్నారు. అయితే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగిన సంద ర్భాల్లో, భూముల విలువలను సవరించిన సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి కొద్ది రోజుల పాటు నెలకొనడం సాధారణమే నని వారం పది రోజుల్లో లావాదేవీలు సజావుగా జరగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్‌ విలువ పెంపు ఇలా..

కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోని ఇంటి స్థలాలకు మార్కెట్‌ విలువ వారం రోజుల క్రితం కనిష్టంగా 5,400 రూపాయల నుంచి గరిష్టంగా 30 వేల రూపాయలు ఉండగా సవరించిన విలువల ప్రకారం 10,800 నుంచి 60 వేల రూపాయల వరకు పెరిగింది. అలాగే అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్‌లు గతంలో చదరపు అడుగుకు 1500 నుంచి 3 వేల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఆ విలువలు 3 వేల నుంచి 6 వేలకు పెరిగాయి. గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఎక్కువ భూ లావాదేవీలు జరిగే గ్రామాల్లో 90 శాతం రేట్లు పెరిగాయి. గ్రామీణ వ్యవసాయ భూములకు 25 శాతం భూమి విలువ పెరిగింది. గంగాధర వ్యాపార కూడలిలో గజం స్థలం 4100 ఉండగా ప్రస్తుతం 5,200 రూపాయలకు కొత్తపల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి, చింతకుంట మల్కాపూర్‌ మొదలగు కరీంనగర్‌ పట్టణానికి దగ్గర ఉన్న గ్రామాల్లో గజం ధర 700 నుంచి 1300 రూపాయలకు పెరిగింది. కొత్తపల్లిలో 2,100 రూపాయలకు ఉన్న గజం విలువ ప్రస్తుతం 3,200 రూపాయలకు సవరించారు. గంగాధర, కురిక్యాల, మధురానగర్‌ గ్రామాల్లో ఎకరాన 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధర ఉండగా ప్రస్తుతం సవరించిన ఽవిలువల ప్రకారం కోటిన్నర నుంచి రెండు కోట్లకు పెరిగింది. తిమ్మాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఇంటి స్థలాలకు వారం రోజుల క్రితం మార్కెట్‌ విలువ గజానికి 700 రూపాయలు ఉండగా 1300 రూపాయలకు, కమర్షియల్‌ స్థలం 3,400 రూపాయలు ఉండగా 5,100 రూపాయలకు సవరించారు. కనిష్టంగా 20 శాతం గరిష్టంగా 75 శాతం భూముల విలువలు పెరిగాయి. భూములను వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రోడ్ల వెంట ఉన్న భూములను వేరు వేరు కేటగిరీలుగా గుర్తించి విలువలు పెంచారు. వ్యవసాయ భూములకు గరిష్టంగా ఎకరాకు 11,25000 నుంచి 12,93,750 రూపాయల వరకు పెంచారు. వ్యవసాయేతర భూములను 63 లక్షల నుంచి 72,45,000 వరకు పెంచారు. రాజీవ్‌ రహదారి వెంట రేణికుంట వద్ద అత్యధికంగా భూముల విలువ ఎకరాకు 38,58,000 రూపాయల నుంచి 40,91,700 రూపాయలకు పెంచారు. వ్యవసాయ భూములు కనిష్టంగా నాలుగున్నర లక్షలు ఉన్నవి 5,17,500కు పెరిగింది. భూముల విలువలు పెరగడంతో పాటు ప్రస్తుతం అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. విలువలు పెంచిన కారణంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో లావాదేవీలు నిర్వహించేందుకు వేచి చూసే దోరణితో ఉన్నట్లు చెబుతున్నారు. విలువల సవరింపు విషయంలో ప్రభుత్వం రెండవ ఆలోచన ఏమైనా చేస్తుందేమోనని వేచి చూస్తున్నట్లు భావిస్తున్నారు.

క్రయవిక్రయాలు నెమ్మదించాయి

- తిమ్మాపూర్‌ తహసీల్ధార్‌ శ్రీనివాస్‌ రెడ్డి

వ్యవసాయ సీజన్‌లో ప్రస్తుతం భూములు అమ్మే వారు కొనే వారు తగ్గిపోయారు. మార్కెట్‌లో డబ్బులకు ఇబ్బంది పరిస్థితి ఉన్నది. అందకే క్రయ, విక్రయాలు నెమ్మదించాయి. తిమ్మాపూర్‌ మండలంలో వ్యవసాయ భూముల ఽవిలువలు 15 శాతం పెరిగాయి. గతంలో రోజు 4 నుంచి 6 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 2 నుంచి 3 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. నాన్‌ అగ్రికల్చర్‌ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి.

ఫ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగలేదు

- తిమ్మాపూర్‌ ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అయేషా తబష్హుమ్‌

తిమ్మాపూర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయ పరిధిలో తిమ్మాపూర్‌, మానకొండూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం మండ లాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. భూములు, ఆస్తుల విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ ఖర్చులు గతంలో కంటే 25 శాతం పెరిగాయి. కానీ స్టాంపు డ్యూటీ పెరగలేదు. వారం రోజుల క్రితం ప్రతి రోజు 15 నుంచి 20 రిజిస్ట్రేషన్లు జరగగా, ఇప్పుడు 8 నుంచి 15లోపు జరుగుతున్నాయి. మార్టిగేజ్‌, హౌజింగ్‌, బ్యాంకు లింకేజి అవసరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి.

Updated Date - Jun 13 , 2026 | 01:51 AM