Share News

సన్నాల ఆన్‌లైన్‌ 10లోపు గడవు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:28 AM

వానాకాలం సీజన్‌లో సన్నరకానికి రైతులకు బోనస్‌ రావాలంటే ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పంటల వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ సీజన్‌కు ప్రభుత్వం సూచించిన ఏడు రకాల ధాన్యానికే క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రభుత్వం అందించనుంది.

సన్నాల ఆన్‌లైన్‌ 10లోపు గడవు
హుజూరాబాద్‌లో సాగు చేస్తున్న వరి

హుజూరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో సన్నరకానికి రైతులకు బోనస్‌ రావాలంటే ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పంటల వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ సీజన్‌కు ప్రభుత్వం సూచించిన ఏడు రకాల ధాన్యానికే క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే బోనస్‌ రావాలంటే తప్పనిసరిగా తాము సాగు చేసిన సన్నరకాల విత్తనాల వివరాలను టీ-అగ్రిసీడ్స్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రైతులందరూ సెప్టెంబరు 10లోగా వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఏఈవోలు గ్రామాల్లో తిరుగుతూ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రైతులు స్వయంగా సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ఫ ఏడు రకాల సన్నాలు...

రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు బోనస్‌ ఇస్తానని ప్రకటించింది. అందులో ఆర్‌ఎన్‌ఆర్‌ (15048), సాంబమసూరి (5204), కేఎన్‌ఎం (1638), హెచ్‌ఎంటీ (సోనా), జైశ్రీరామ్‌, డబ్ల్యూజీఎల్‌ (44), కేఎన్‌ఎం (7715) రకాలు ఉన్నాయి. ఈ సారి రైతులు సన్నారకాలకు రైతులు మొగ్గు చూపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువు లోగా వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వం అందించే 500 రూపాయల బోనస్‌ పొందవచ్చని హుజూరాబాద్‌ ఏడీఏ సునీత తెలిపారు.

ఫ పత్తికి మద్దతు ధర రావాలంటే...

కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర రావాలంటే తప్పనిసరిగా రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రైతుల పేరు ఉంటేనే కొనుగోలు చేస్తారు.

Updated Date - Aug 29 , 2026 | 12:28 AM