డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:52 AM
డే కేర్ సెంటర్ సేవలను వృద్ధులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డే కేర్ సెంటర్ సేవలను వృద్ధులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రణామ్ పేరిట ఏర్పాటుచేసిన వృద్ధుల డే కేర్ కేంద్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో సోమవారం ప్రారంభించ గా, సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఏర్పాటుచేసిన వయోవృద్ధుల డే కేర్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వృద్ధుల మానసికో ల్లాసం, భద్రత, సంరక్షణ లక్ష్యంగా ‘ప్రణామ్’ పథకం కింద రాష్ట్ర ప్రభు త్వం మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలి పారు. డే కేర్ కేంద్రంలో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ టీవీ సదుపాయాలు అందు బాటులో ఉంటాయని వివరించారు. వృద్ధులకు ఉచితంగా స్నాక్స్‌తోపాటు టీ అందిస్తారని తెలిపారు. పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్‌లు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ శాఖ అధి కారి లక్ష్మీరాజం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఐఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చ య్య తదితరులు పాల్గొన్నారు.