ప్రమాదకరంగా మల్లారం మూలమలుపు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:21 AM
నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్ల మూలమలుపులు ప్రమాదకరంగా మారా యి.
వేములవాడ రూరల్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్ల మూలమలుపులు ప్రమాదకరంగా మారా యి. రద్దీగా ఉండే రోడ్ల వద్ద ఉన్న మూల మలుపులు వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మల్లారం గ్రామం నుంచి హన్మాజిపేట వెళ్లే రహదారి, ఫాజుల్‌నగర్ ఎల్లమ్మ ఆలయం వద్ద, వట్టెంల గ్రామం వద్ద మూలమలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. దీంతో వట్టెంల గ్రామం వద్ద, ఫాజుల్‌నగర్ ఎల్లమ్మ గుడి వద్ద ప్రమాదాల నివారణకు రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, సూచికబోర్డులు, రోడ్ స్టడ్స్ ఏర్పాటు చేయడానికి ఇటీవల అధికారులు పరిశీలించారు. మల్లారం గ్రామం వద్ద కూడా తరచూ ప్రమదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనా లు కనిపించకుండా ఉండేంతగా మూలమలుపు తీవ్రత ఉంది. వేముల వాడ నుంచి కోనరావుపేట మండలానికి వెళ్లే మార్గం కాబట్టి నిత్యం వంద లాది మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రమాదకరమైన మూలపు ఉందని తెలిపే హెచ్చరిక బోర్డులు, బ్లింకర్ లైట్లు లేవు. తీవ్రనష్టం జరగక ముందే అధికారులు తగు చర్యలు చేపట్టాలని, మల్లారం మూలమలుపు వద్ద సూచి క బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం..
- చల్ల వెంకట్రాజం, రూరల్ ఎస్సై
మల్లారం మూలమలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. ఆర్‌అండ్‌బి అధికారు లతో సమన్వయం చేసుకుని మల్లారం మూలమ లుపు వద్ద ప్రమాదాల నివారణకు తగు ఏర్పాట్లు చేస్తాం. అన్ని గామ్రాల ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నాం.