Share News

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

ABN , Publish Date - May 04 , 2026 | 12:39 AM

మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాంతకంగా మారినా సంబంధిత ఆఽధికారు లు పట్టించుకోవడం లేదు.

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

చందుర్తి, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాంతకంగా మారినా సంబంధిత ఆఽధికారు లు పట్టించుకోవడం లేదు. చందుర్తి మండల తిమ్మాపూర్‌, ఆశిరెడ్డిపల్లి, మూడపల్లి, నర్సింగాపూర్‌ తదితర గ్రామాల్లో ఎక్కడికక్కడే విద్యుత్‌ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నా వాటిని సరిచేయడానికి అధికారులు చొరవచూపడం లేదు. పొలాల్లోకి రైతులు వెళ్లాలన్నా, విద్యుత్‌ వైర్ల కింద ఉన్న పంట పొలాల్లో పనులు చేయాలన్నా కూలీలు బెంబేలెత్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. హార్వెస్టర్‌ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న పలు చోట్ల రైతులే తాత్కాలికంగా కర్రలతో స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని గ్రా మాల్లో కరెంట్‌ తీగలను తాకుతూ చెట్లు, పొదలు పెరిగినా వాటిని తొలగిం చే చర్యలు చేపట్టడం లేదు. గాలికి కొమ్మలు తగిలి విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. రైతులు ఆందోళన వ ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వేలాడుతూ యమపాశాలుగా మారిన విద్యుత్‌ తీగలను సరిచేయాలని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదం జరగకముందే తీగలను సరిచేయాలి

- చిర్రం తిరుపతి, చందుర్తి

పంటపొలాల వద్ద కిందికి వేలాడుతున్న వి ద్యుత్‌ తీగలను ప్రమాదం జరుగకముందే విద్యు త్‌శాఖ అధికారులు వెంటనే సరిచేయాలి. గ్రాయా ల్లో ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నాయి. హార్వె స్టర్‌ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నా యి. గతంలో పలు గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తగల డంతో పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్లు దగ్ధమ య్యాయి. నష్టం జరుగకముందే అధికారులు చర్యలు చేపట్టాలి.

Updated Date - May 04 , 2026 | 12:39 AM