Share News

దళితులకు కాంగ్రెస్‌ పార్టీలోనే గౌరవం

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:58 AM

కాంగ్రెస్‌ పార్టీలో నాటి నుంచి నేటి వరకు దళితులకు గౌరవంతో పాటు ప్రాధన్యం ఉందని, ఏ పార్టీలో దళితులకు ఇంతటి గౌరవం లభించదని టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షులు, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమై తొలిసారి జిల్లాకు వచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

దళితులకు కాంగ్రెస్‌ పార్టీలోనే గౌరవం
కరీంనగర్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

- పార్టీకి దళితులు అండగా నిలవాలి

- టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్‌ అర్బన, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో నాటి నుంచి నేటి వరకు దళితులకు గౌరవంతో పాటు ప్రాధన్యం ఉందని, ఏ పార్టీలో దళితులకు ఇంతటి గౌరవం లభించదని టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షులు, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమై తొలిసారి జిల్లాకు వచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తాలో జిల్లా ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన సమావేశంలో కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. తనపై నమ్మకం, విశ్వాసంతోనే, దళితులకు సేవలు అందించాలని రాష్ట్ర పదవి అప్పగించిన కాంగ్రెస్‌పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఖర్గే, సీఎం రేవంతరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి దళితుల అభివృద్ధికి పాటుపడుతానన్నారు. రేవంతరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దళితులకు ఉన్నత గౌరవంతోపాటు ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేందుకు అండగా నిలువాలన్నారు.

దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది

- డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులను రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్‌పార్టీదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వెంట్రుకవాసిలో మంత్రి పదవి చేజారిందని, దానికి మించి ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులుగా దళితజాతిని అభివృద్ధి చేసేందుకు, సేవలు అందించేందుకు పదవి వచ్చిందన్నారు. సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రతిపక్షంలో ఉండి అనేక నిర్భందాలు ఎదుర్కొంటూ పోరాటాలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సతీమణి డాక్టర్‌ అనురాధ మాట్లాడుతూ తాను ఇంటిలో చెబితే డాక్టర్‌ కవ్వంపల్లి వినరని, సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నానని అన్నారు. రాష్ట్రంలో 17 శాతం దళితులుకు న్యాయం చేసేందుకే ఏఐసీసీ ఎస్సీసెల్‌ చైర్మన పదవి ఇచ్చిందన్నారు. ఈ పదవిని సమర్ధవతంగా నిర్వహించి, దళితులకు అన్ని విధాల అండదండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన బ్యాంక్‌ చైర్మన కర్ర రాజశేఖర్‌, ఆర్టీఏ మెండర్‌ పడాల రాహుల్‌, బెజ్జంకి మార్కెట్‌ కమిటీ చైర్మన పులి కృష్ణ, కరీంనగర్‌ కార్పొరేషన కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజనకుమార్‌, అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన, కోడూరి సత్యనారాయణగౌడ్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఒడితెల ప్రణవ్‌బాబు, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కర్ర సత్యప్రసన్నరెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కవ్వంపల్లికి కాంగ్రెస్‌ శ్రేణుల ఘనస్వాగతం

టీపీసీసీ ఎస్సీసెల్‌ చైర్మనగా నియామకమై శనివారం తొలిసారి జిల్లాకు వచ్చిన మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్టీఆర్‌ చౌక్‌లో కవ్వంపల్లికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా ఓపెనటాప్‌ వాహనంలో కమాన ద్వారా తెలంగాణ చౌక్‌కు చేరుకుని ఇందిరా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో క్రేన సహాయంతో కవ్వంపల్లికి గజమాలతో సన్మానం చేశారు. ఇందిరా చౌక్‌ నుంచి కోర్టు చౌక్‌ వరకు మేడిపల్లి సత్యం బుల్లెట్‌ వాహనంపై కవ్వంపల్లిని తీసుకుని కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. కోర్టు చౌరస్తాలో కవ్వంపల్లి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభావేదికపై పలువురు కవ్వంపల్లిని ఘనంగా సన్మానించారు.

Updated Date - Jan 11 , 2026 | 12:58 AM