Share News

అంబేద్కర్‌ విగ్రహానికి దళిత సంఘాల క్షీరాభిషేకం

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:48 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌కు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలను వెంటనే సీజ్‌ చేయించాలని, బుక్కలు రాసిన రచయితపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని పోలీసులను ఆదేశించడాన్ని హర్షిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో నాయకులు క్షీరాభిషేకం చేశారు.

అంబేద్కర్‌ విగ్రహానికి దళిత సంఘాల క్షీరాభిషేకం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌కు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలను వెంటనే సీజ్‌ చేయించాలని, బుక్కలు రాసిన రచయితపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని పోలీసులను ఆదేశించడాన్ని హర్షిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనం తరం అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్య క్షుడు కత్తెర దేవదాస్‌ మాట్లాడారు. మనువాద పార్టీలు హమారా ప్ర సాద్‌ అనే వ్యక్తిని ఉసిగొలిపి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ చరి త్రకు విరుద్ధంగా బుక్కులు రాయించి అసత్య ప్రచారం చేయడానికి కుట్రలు జరిగాయని ఆరోపించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్ర యించగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలను వెంటనే సీజ్‌ చేయించాలని, బుక్కలు రాసిన రచయితపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింద న్నారు. భారత రాజ్యాంగం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను ఎవరు అవమా నించిన ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగుల రాములు, తుంగ శివరాజ్‌, అకునూరి బాలరాజు, సిరిగిరి కిషోర్‌కుమార్‌, నేదురి లక్ష్మిన్‌, మంగ కిరణ్‌, లింగంపల్లి సత్యనా రాయణ, కంసాల మల్లేశం, పాటి కుమార్‌రాజ్‌, ధర్మెందర్‌, మేకల కమలాకర్‌, మల్లాల నాగరాజు, కాదాసు శేఖర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:48 AM