ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:58 PM
యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్స హించాలని ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్స హించాలని ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి ప్రధానకార్యదర్శి సంజ య్‌జాజు వ్యవసాయ శాఖ, కార్యాచరణ ప్రణాళిక, విద్యా శాఖ, భూసేకరణ, వీధికుక్కల నియంత్రణ, వీబీజీ రామ్ జీపనుల పురోగతిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షిం చారు. యాసంగి సీజన్‌లో ప్రాజెక్టులల్లో నీటి లభ్యత లేనందున వరిసాగును నియంత్రించాలని సూచించారు. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించాలని సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించాలని కోరారు. పంటల వైవిద్యీకరణ, ఖరీఫ్ పంటల ఉత్పాదకత పెంపు, రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే ప్రయో జనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇతర పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కొను గోలు కేంద్రాలను ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ ధాన్యం సేక రణ ప్రక్రియను కలెక్టర్ నిత్యం పర్యవేక్షించాలని ఆదేశిం చారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడిన్షియల్ విద్యాలయా ల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజ రుపై దృష్టి సారించాలని కోరారు. ఎఫ్‌అర్‌ఎస్‌తో హాజరు ను పర్యవేక్షించాలని, విద్యార్థుల హాజరుకనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాలయాల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మోరుగు పరిచేందుకు ఫిజిక్స్‌వాలా, ఖాన్‌అకాడమీ వంటి డిజి టల్ అభ్యసన వేదికలను వినియోగించుకోవాలని కోరారు. భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టుల నిర్మాణ పనులల్లో వేగం పెం చాలని కోరారు. పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరె న్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా వ్యవసా యాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికా రి రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి విజయ్‌సాగర్, టీజీ ఈడబ్ల్యూ ఐడీసీ ఈ ఈ రామకృష్ణ, నీటి పారుదల శాఖ అధికారి యుగంధర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, అర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, పంచాయతీ రాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు అన్వ ర్, సుమలత, ఎస్‌డీసీ మోహన్‌సింగ్ పాల్గొన్నారు.