Share News

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:50 PM

యాసంగిలో వరి వేయవద్దని, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న, ను వ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ పేర్కొన్నారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు

సిరిసిల్ల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : యాసంగిలో వరి వేయవద్దని, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న, ను వ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ గరిమఅగ్రవాల్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సూపర్‌ ఎల్‌నినో ప్ర భావం, ప్రత్యామ్నాయ ప్రణాళిక తదితర అంశా లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా వర్షపాతం, రానున్న మూడు నెలల్లో వర్షపాతం, నీటిపారుద ల, వివిధ పంటల సాగు తదితర అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు తక్కువగా కురిశాయని, రానున్న మూడు నెలల్లో వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ నివేదిక తెలిపిందని వెల్లడించారు. ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ, మల్కపేట రిజర్వాయర్లలో నీటిమ ట్టాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా ప్రజలకు తాగునీరు, మూగజీవాలకు మాత్రమే వినియోగించడానికి ఉన్నాయని తెలి పారు. ఒక ఎకరంలో వరి సాగు చేయాలంటే 32 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమని వెల్లడించారు. ఒక ఎకరంలో వరి సాగు చేసే నీటితో ఐదు నుంచి ఆరు ఎకరాల్లో ఆరు తడి పంటలు చేయవచ్చని తెలిపారు.

తగ్గుతున్న భుగర్భ జలాలు

ప్రస్తుత వేడి వాతావరణం తక్కువ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు రానురాను తగ్గు తున్నాయని కలెక్టర్‌ వివరించారు. ఉమ్మడి కరీం నగర్‌ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే రాజ న్న సిరిసిల్లజిల్లాలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు మేరకు రైతులు ఈ యాసంగి సీజన్‌లో వరి వేయవద్దని సూచించా రు. అధికారుల సూచన మేరకు పప్పు ధాన్యా లు, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. భూగర్భ జ లాలు తగ్గిపోతుండడంతో విద్యుత్‌పై మరింత ఎక్కువ భారం పడి ఇబ్బందులు వచ్చే ప్రమా దం ఉందని స్పష్టం చేశారు. రైతులు నీరు, విద్యుత్‌ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని వరి సాగును చేయవద్దని సూచించారు. వచ్చే నెల నవంబరు 30వ తేదీ వరకు జిల్లాలోని ఆయా మండలాల్లో కేతు బచావో అభియాన్‌ అలాగే సూపర్‌ ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నా య పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవ సాయ, ఉద్యానవన శాఖ, నీటిపారుదల శాఖ, విద్యు త్‌ శాఖ ఏఈలు ప్రతి మం గళ, బుధవారంలో ఆయా సమావేశాలకు హాజరై ప్ర స్తుత వాతావరణ పరిస్థితు లు, నీటి మట్టాలు, విద్యుత్‌ వ్యవస్థ తదితర అంశాలపై రైతులకు, ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు.

నూతన బోర్లకు అనుమతి తప్పనిసరి

జిల్లాలో నూతనంగా బోర్లు వేసేందుకు తహ సీల్దార్‌ వద్ద అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వాల్టా చట్టం ప్రకారం అనుమ తి లేకుండా జిల్లాలో ఎవరూ బోర్లు వేయవద్దని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో నీటి వృథాను అధికారులు అరికట్టాలని ఆదేశించారు. ప్రతి నల్లాకు ఆన్‌ ఆఫ్‌ బటన్‌ ఉండాలని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ, మున్సిపల్‌, గ్రామపంచాయతీ అధికారులు తమ పరిధిలో పర్యటించి నీటి వృథాను పర్యవేక్షించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

ముమ్మరంగా తెలంగాణ జలసిరి పనులు

వీబీజీ రామ్‌ జీ కింద తెలంగాణ జలసిరి ప నులను ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదే శించారు. ఆయా పనులను చేపట్టడంతో కూలీల కు సైతం ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, మిషన్‌ భగీరథ ఎస్‌ ఈ రాములు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్య వసాయ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శా ఖఅధికారి శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:51 PM