బీజేపీ భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన ఎన్నికలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:01 AM
రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్దే శించే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి, జిల్లా మున్సిపల్ కన్వీనర్ ఇనుగుల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
వేమలవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్దే శించే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి, జిల్లా మున్సిపల్ కన్వీనర్ ఇనుగుల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశానికి మంగళవా రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో పెద్దిరెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ధేశించే కీలక ఎన్నికలని, ప్రతికార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టప డి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలంతా బుద్ధి చెబుతారని, అమలుకు నోచుకుని హామీలను ఇచ్చి మోసం చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ సారథ్యంలో పార్టీ మ రింత అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణానికి చెందిన పలువురు బీజేపీ పార్టీ లో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నియో జకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు, రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, కోల కృష్ణస్వామి, కుమ్మరి శంకర్, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ నాయకులు అల్లాడి రమేష్, రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, మల్లేశం, అక్కనపెల్లి వివేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.