Share News

అభివృద్ధికి పట్టం కట్టండి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:08 AM

వేములవాడ పట్టణంలో జరు గుతున్న అభివృద్ది పనులు పట్టణ ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అభివృద్ధికి పట్టం కట్టండి

వేములవాడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణంలో జరు గుతున్న అభివృద్ది పనులు పట్టణ ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణానికి చెందిన 12వ వార్డు బీజేపీ పార్టీ మాజీ కౌన్సిలర్‌ రామతీర్థపు కృష్ణవేణి-హరీష్‌లు సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవం త్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. ఎన్నడు లేని విధంగా వందల కోట్ల రూపాయలతో పట్టణాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సూచించారు. ఈ ప్రాంత ప్రజలు, రాజన్న భక్తుల 50 యేళ్ల కల ఒకటే అని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ది, మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు వెడల్పు పట్టణ ప్రజల ఆకాంక్ష అని తెలి పారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు, రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. అన్ని వార్డుల్లో కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలోని శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరై ఉన్నాయని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు రామతీర్థపు అంజయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:08 AM