అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టండి
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:14 AM
అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌లో సిరిసిల్ల ఆసాముల సమన్వయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో సిరిసిల్లలో అత్యధిక వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ద తును అందించి ఆశీర్వదించాలన్నారు. సిరిసిల్లలో మూడంచెలుగా ఉన్న వస్త్ర పరిశ్రమకు పని కల్పించే విధంగా ప్రభుత్వం పరిశ్రమ బకాయి లను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత ప్రభుత్వంలో యువ రాజుగా వెలుగొంది సిరిసిల్ల ప్రజల కోసం చర్మం ఒలియి చెప్పులు కట్టించినా తక్కువేనని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎలాంటి లాభం చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం పెట్టిపోయిన బతకమ్మ చీరల బకాయిలు రూ.300కోట్లు ప్రజా ప్రభుత్వం చెల్లించింద న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లూటి చేసిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత వస్త్ర పరిశ్రమకు పని కల్పించి కోటి చీరల ఆర్డర్లు ఇచ్చి ఇందిరమ్మ చీరలను సిరిసిల్లలో తయారు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాల యం చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సి లర్లు, నాయకులు పాల్గొన్నారు.