భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:49 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ టౌన్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్నపూజ, కల్యాణం, తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. ప్రధాన దేవాలయమైన రాజరాజేశ్వర స్వామి వారిని ఎల్‌ఈడి స్ర్కీన్‌లో భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
బద్ది పోచమ్మ ఆలయంలో..
వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవా రికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బద్ది పోచమ్మ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.