భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:44 AM
వేములవాడ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ రూరల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తలనీలాలు సమర్పించి పవిత్రస్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. గండా దీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. ఆదివారం దాదాపు 35వేలమంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోకూడదని సిబ్బందికి సూచించారు.