Share News

పంటలు ఎండుతున్నాయి.. కరెంట్‌ ఇవ్వండి

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:24 AM

అరకొర విద్యుత్‌ సరాఫర తో పంటలు ఎండుతున్నాయని, సక్రమంగా విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని బొమ్మనపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు.

పంటలు ఎండుతున్నాయి.. కరెంట్‌ ఇవ్వండి
రోడ్డుపై బైఠాయించి అందోళన చేస్తున్న రైతులు

చిగురుమామిడి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అరకొర విద్యుత్‌ సరాఫర తో పంటలు ఎండుతున్నాయని, సక్రమంగా విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని బొమ్మనపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్‌ కోతపై అధికారులను ప్రశ్నిస్తే సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నామని, వాటికి నీరందిస్తామంటే విద్యుత్‌ సరిగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై జగదీశ్వర్‌ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా రైతులు వినలేదు. ట్రాన్స్‌కో అధికారులను రప్పించాలని బొమ్మనపల్లి ఓ రైతు ఎస్సై కాళ్లను పట్టుకున్నారు. సంబందిత అదికారులతో ఎస్సై మాట్లాడి డీ నరేందర్‌, ఏఈని అక్కడికి రప్పించారు. వారు మాట్లాడుతూ ఇకపై ఎలాంటి కోతలు లేకుడా విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కత్తుల రమేష్‌యాదవ్‌, జంగ వెంకటరమాణరెడ్డి, మిట్టపల్లి మల్లేశం, కసర్ల హరిష్‌ పటేల్‌, జంగ శ్రీనివాస్‌ రెడ్డి, గందె సంతోష్‌, తొట శ్రీనివాస్‌, మామడి రమేష్‌, కసిర వేని ఓదేలు, ప్రవీణ్‌, రాగులు వెంకన్న, కంది శంకర్‌, గందె నారయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:24 AM