రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్‌పై విమర్శలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:15 AM
రాజకీయంగా లబ్ధిపొంద డానికి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తోందని విమ ర్శించాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రాజకీయంగా లబ్ధిపొంద డానికి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తోందని విమ ర్శించాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో స్థానికంగా జరిగిన సంఘటన ఆత్మహత్య, మిస్టరీగా రోజుకో రకంగా ప్రచారం జరిగిందని, వెంగళ వెంకటేశం హత్య జరగడం దురదృష్టకరమన్నారు. మృతుడి వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలుపు తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈనెల 6న వెంగళ వెంకటేశం అదృశ్యం కేసు నమోదు కావడం, మర్నాడు ఆయన మృతదేహం లభ్యం కావడం, పోలీసుల విచారణలో మర్డర్‌గా తేలడం తో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేసి రెండు రోజులో మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టుచేసి రిమాండ్ చేయడా న్ని పోలీసుల పనితీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీ యాలు చేస్తోందని రాజకీయ కోణంలోకి మార్చాలని చూడడం విచార కరమని అన్నారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా హత్య రాజకీయాలు చేసిన ఆనవాళ్లు లేవన్నారు. మృతుడు, నిందితుల వ్యక్తి గత ఆర్థిక లావాదేవిల కారాణాల వల్లే ఈ సంఘటన జరిగిందని బాధిత కుటుంబమే చెప్పిందన్నారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని, కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. మూడు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వంలో ఎక్కడా ఏ చిన్న సంఘటన జరిగిన పార్టీలకు అతీతంగా విచారణ జరిపి నిందితులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ముందుకు కదులుతుందన్నారు. సిరిసిల్లలో జరిగిన సంఘటనపై ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీ రాజకీయంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిం చారు. మృతుడు చనిపోక ముందు సోషల్ మీడియాలో ఏం మాట్లా డిండు...? ప్రజావాణిలో కలెక్టర్ ఎవరిపైన ఫిర్యాదులు చేశాడో వార్త పత్రికలలో, సోషల్ మీడియాల్లో వచ్చాయని ప్రజలు కూడా చూశారని అన్నారు. కేటీఆర్ దీన్ని హత్యా రాజకీయాలంటూ రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశాడని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామనడం వరకు మంచి పరిణామం అన్నారు. కాని కాంగ్రెస్ పార్టీపై హత్యా రాజకీయాలంటూ రుద్దడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో నేరెళ్ళ సంఘటనను తెలంగాణ ప్రజలెవ్వరు మరిచిపోలేదని అన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయో గించిన నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చలనం లేదని, కేటీఆర్ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీతో అనారోగ్యం పాలైన బాధితుడు గోపాల్ మరణించడం అంటే అదీ రాజకీయ హత్య అని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నాయకులు తప్పు చేసే పరిస్థితులు లేవన్నారు. పోలీసు శాఖ నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటుందని మృతుడి కుటుం బానికి ఇందిరమ్మ ఇళ్ళు, మృతుడి భార్యకు పింఛన్ అందేలా తాము బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, సిరిసిల్ల మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు కూర శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రియాజ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ బైరి ప్రభాకర్, నాయ కులు పాల్గొన్నారు.