క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకే క్రికెట్ పోటీలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:52 AM
క్రీడాకారులను వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జడ్పీమాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులను వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జడ్పీమాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు పేర్కొన్నారు. మండలంలోని ముస్కానిపేట గ్రామంలోని సింగిరెడ్డి వీరారెడ్డి గ్రౌండ్‌ను ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మండలంలోని 14ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 14జట్లు పాల్గొనాలని సూచించారు. ప్రథమస్థానంలో నిలిచిన జట్టుకు రూ 50వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ 258వేలు ఇవ్వడంతో పాటు జిల్లాలో జరిగే పోటీలలకు అర్హత సాధిస్తారని తెలిపారు. క్రికెట్ పోటీలను సోమవారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్ని గ్రామాల నాయకులు పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉడుతల వెంకన్న, గొడిశెల జితేందర్, రడం ప్రవీణ్, సాదుల్, సావనపెల్లి అనీల్, ఎలవేని రమేష్, రాగటి రమేష్, దయ్యాల మహేష్, చదువాల పర్శరాం తదితరులు పాల్గొన్నారు.