రూ.101కే దహన సంస్కారాల ప్రక్రియ పునరుద్ధరణ
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:46 AM
సిరిసిల్ల మున్సిపల్ వైకుంఠధా మాల్లో రూ.101లకే దహన సంస్కారాల ప్రక్రియను పునరుద్ధరిస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది.
సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (ఆంరఽధజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్ వైకుంఠధా మాల్లో రూ.101లకే దహన సంస్కారాల ప్రక్రియను పునరుద్ధరిస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. సిరిసిల్లలో కార్మిక కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న నేపథ్యంలో గత పాలకవర్గం దహన సంస్కారాలు రూ.101లకే అమలు చేసింది. కొన్ని కారణాలతో నిలిచిపో యింది. నూతనంగా వచ్చిన మున్సిపల్ పాలకవర్గం తొలి సమావేశం లోనే రూ.101 దాహన సంస్కారాలు నిర్వహించడానికి సంవత్సరానికి సంబంధించి రూ.16.80 లక్షల నిధులు కేటాయిస్తూ తీర్మానించారు. శని వారం మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశం జరిగింది. తొలి సమావే శం సందర్భంగా చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లను మున్సిపల్ సిబ్బం ది సన్మానించారు. కౌన్సిలర్లు సిరిసిల్ల పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న తీరును ప్రశ్నించారు. పట్టణంలోని వివిధ సమస్య లపై చర్చించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి, చెత్త, మట్టికు ప్పలు, పిచ్చి మొక్కలు తొలగించడానికి వార్డుల వారీగా స్పెషల్ శానిటే షన్ డ్రైవ్ నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకోసం రూ.10 లక్షలు ఖర్చు చేయడానికి తీర్మానించారు. పలు వార్డుల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా పవర్ బోర్లకు మోటార్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేయడానికి రూ.10 లక్షలు కేటాయించారు. మున్సిపల్ కు సంబంధించిన 9 ట్రాక్టర్లు, బ్లేడ్ ట్రాక్టర్, ల్యాడర్ వ్యాన్, ఆరు ఆటోల రిపేర్‌కు రూ.11.20 లక్షలు కేటాయిస్తూ మంజూరు ఇచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా మాజీద్,ఈద్గాల వద్ద మౌలిక వసతులు కల్పించ డానికి రూ.3లక్షలు కేటాయించారు. అధికారిక పర్యటనలు,వివిధ సమా వేశాలకు హాజరుకావడానికి అద్దె ప్రాతిపదికన చైర్‌పర్సన్, కమిషనర్లకు కార్లు ఏర్పాటుకు సంవత్సరానికి ఒక్కోకారు అద్దె రూ.3.96లక్షల చొప్పున రూ.7.92 లక్షలు మున్సిపల్ నిధుల నుంచి ఖర్చు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైస్‌చైర్మన్ దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.