ఎన్‌టీఏను రద్దు చేయాలని సీపీఐ ధర్నా
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:05 AM
ఎన్‌టీఏ రద్దు, నీట్ పరీక్ష లీక్‌పై శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపె పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలతో నాయకులు ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఎన్‌టీఏ రద్దు, నీట్ పరీక్ష లీక్‌పై శాంతియుతంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపె పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలతో నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా సీపీఐ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ విద్యార్థుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిం చాలని డిమాండ్ చేశారు. ఢీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై దాడిని సీపీఐ ఖండిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమమ నాగరాజు, నల్ల చంద్రమౌళి, కోడం కృష్ణహరి, సామల రామనారాయణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.