Share News

నేటి నుంచి సీపీఐ ప్రచార జాత

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:53 PM

సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రచార జాత నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ తెలిపారు.

నేటి నుంచి సీపీఐ ప్రచార జాత
సీపీఐ ఆధ్వర్యంలోనిర్వహించేప్రచార జాత వాల్‌ పోస్టర్‌ను అవిష్కరిస్తున్నసీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌

భగత్‌నగర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రచార జాత నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ప్రచార జాత వాల్‌పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 వరకు తొమ్మిది రోజులపాటు ప్రచార జాత నిర్వహిస్తామన్నారు. ప్రచార జాతను సీపీఐ సీనియర్‌ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పద్మనగర్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, చొక్కల శ్రీశైలం, బండరాజిరెడ్డి, గోవిందుల రవి, లంకదాసరి కళ్యాణ్‌, మౌలానా పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:53 PM