కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభం..
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:25 AM
రాష్ట్ర ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికే కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీఆర్‌ఎస్ నియో జకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు.
వేములవాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికే కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీఆర్‌ఎస్ నియో జకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. ఎల్నీనో ప్రభావం, సాగునీరు, వి ద్యుత్, ఎరువులాంటి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ తప్పుదోవ పట్టిస్తు న్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. వేములవాడ పట్టణంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేక ర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎత్తి పోతల ద్వారా కనీసం నియోజకవర్గానికి సాగు నీరు తీసుకువచ్చి ఈప్రాంత రైతులను ఆదు కోవాలని, మల్కపేట రిజర్వాయర్ ఇప్పటివర కు ఒక్క టీఎంసీ మాత్రమే నింపారని, మధ్య మానీరులో 24 టీఎంసీల నీరు నిలువ ఉందని మరో మూడు టీఎంసీల నీటిని నింపి రైతుల కు సాగునీరు అందించాలని తెలిపారు. రైతుల కు యూరియాను కూడా దొరకకుండా చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్‌దని మండిప డ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను యూనిట్‌గా చేసి రైతులకు యూరి యా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వేములవాడ శ్రాత్రాజుపల్లి రైతుకు, గంభీరావుపేటలో ఒక బస్తా, వీర్న పల్లిలో ఒక బస్తా, ముస్తాబాద్‌లో ఒక బస్తా వస్తే ఎట్లా తెచ్చుకుం టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రతుల అవసరాలను గుర్తించి ఒక మండలాన్ని యూనిట్ చేసి యూ రియా పంపిణీ చేస్తున్న పరిపాల నే ఇందుకు నిదర్శనమని హేళన చేశారు. అష్టకష్టాలు పడి పంటను పండిస్తే గడిచిన యాసంగి పంటను కొనుగోలు చేయ కుండా రైతులను అరిగోస పెట్టిన మీరు మా ట్లాడుతున్నారన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి తమ నేతలను విమర్శిస్తే వారిస్థాయి పెరగదని, ఇంకోకసారి మాట్లాడితే వారి చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని లేకుంటే అన్ని బహిరంగ పరుస్తామన్నారు. కేటీఆర్‌ని విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. వేముల వాడ ప్రజలతో ఉంటే పరిస్థితి ఏంటో తెలు స్తుందని హితవుపలికారు. పట్టణంలో ప్రజల మధ్య తిరిగి వారి అభిప్రాయాలను తెలుసుకో వాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృ ద్ధి పేరిట తిరిగిన విహారయాత్రలకు ఇప్పటి వరకు రూ.30లక్షలు దుర్వినియోగం చేశార న్నారు. రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, గొస్కుల రవి, ఏశ శ్రీనివాస్, వాసాల శ్రీనివాస్, గడ్డం హన్మాండ్లు తదితరులు ఉన్నారు.