గౌతమినగర్‌లో కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:32 AM
కరీంనగర్ గౌతమినగర్‌లో వన్‌టౌన్ సీఐ కె రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ గౌతమినగర్‌లో వన్‌టౌన్ సీఐ కె రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో, అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) వెంకటరమణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవీకరణ పత్రాలులేని 51 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, ఒక కారు పట్టుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పుల్లయ్య, డాగ్ స్క్వాడ్ బృందం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.