Share News

చెరువు మట్టి తరలింపులో వివాదం

ABN , Publish Date - May 21 , 2026 | 11:42 PM

జిల్లా లోని ఇటుక బట్టీలకు చెరువుల మట్టి తరలింపు వివాదాస్పదంగా మారుతోంది. మట్టి తరలిం పును పలువురు గ్రామస్తులు, పాలకవర్గం అడ్డు కుంటోంది. తమకు సమాచారం లేకుండా మట్టి తరలించడం ఎంత వరకు సమంజసం ఇటుక బట్టీ యజమానులను ప్రశ్నిస్తున్నారు.

చెరువు మట్టి తరలింపులో వివాదం
కొదురుపాక చెరువు నుంచి మట్టి తరలిస్తున్న టిప్పర్లు

అడ్డుకొన్న గ్రామస్తులు

- కొదురుపాక చెరువు వద్ద పెద్దసంఖ్యలో టిప్పర్లు

- సుల్తానాబాద్‌, పెద్దపల్లి ఇటుకబట్టీ యజమానులు మధ్య పోటీ

- పాలకవ్గరంతో ఇటకబట్టీ యజమానుల భేటీ

- గ్రామాభివృద్ధి పేరిట సెటిల్‌మెంట్‌

సుల్తానాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని ఇటుక బట్టీలకు చెరువుల మట్టి తరలింపు వివాదాస్పదంగా మారుతోంది. మట్టి తరలిం పును పలువురు గ్రామస్తులు, పాలకవర్గం అడ్డు కుంటోంది. తమకు సమాచారం లేకుండా మట్టి తరలించడం ఎంత వరకు సమంజసం ఇటుక బట్టీ యజమానులను ప్రశ్నిస్తున్నారు. మట్టి టిప్పర్లను అడ్డుకోవడంతో ఇటుక బట్టీల యజ మానులు వారితో మంతనాలు జరిపి సెటిల్‌ మెంట్‌ చేసుకుంటున్నారు.

ఫ ఇటుకబట్టీల మధ్య పోటీ

ఇటుక బట్టీల కోసం మట్టిని తీసుకోవడానికి అధికారులు జిల్లాలో రెండు చెరువులకు అను మతించారు. సుల్తానాబాద్‌ మండలం కొదురు పాక గ్రామంలోని పెద్ద చెరువు ఒకటి. కొదురు పాక చెరువు నుంచి గతంలో పెద్ద ఎత్తున మట్టి తలించుకుపోయారు. జిల్లా యంత్రాంగం అను మతి మేరకు బట్టీ యజమానులు బుధవారం భారీ యంత్రాలు, టిప్పర్లను చెరువు ప్రాంతానికి తరలించారు. యంత్రాలతో మట్టి తవ్వకాలు చేయించి టిప్పర్లలో లోడింగ్‌ చేయించారు. గ్రామస్తులు, కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో లారీలను అక్కడ నుంచి అనుమతించలేదు. గురువారం కూడా గ్రామ స్తులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ డిమాండ్‌లను ఇటుక బట్టీల యజమానులకు తెలిపారు. సుల్తానాబాద్‌ ప్రాంతానికి చెందిన 11 బట్టీల వారు ఒక బృందంగా మట్టి తవ్వకాలు జరుపుతూ తరలించుకోవడానికి ఏర్పాట్లు చేసు కున్నారు. గురువారం పెద్దపల్లి మండలం రాఘ వపూర్‌ ప్రాంతానికి చెందిన ఇటుక బట్టీల వారు కూడా రంగప్రవేశం చేయడంతో అసలు సమస్య ఏర్పడింది. మట్టి తరలింపునకు సుల్తానాబాద్‌ ప్రాంత బట్టీ యజమానులు గ్రామాభివృద్ధి పేరిట బొడ్రాయి ఏర్పాటు, రోడ్డు కోసం రూ.15 లక్షల అవసరాన్ని గ్రామస్తులు, పాలకవర్గం యజమానుల ముందుంచింది. వారు ఎంతో కొంత ఇవ్వడానికి ఒప్పుకున్నారని గ్రామస్తులు తెలిపారు. రాఘవపూర్‌ గ్రామానికి చెందిన ఇటుక బట్టీల వారు కూడా చెరువు వద్దకు వచ్చి మట్టి తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా సర్పంచ్‌, వార్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి ప్రాంత ఇటుక బట్టీల యజమానుల మట్టి లారీలను టిప్పర్లను అడ్డుకున్నారు.

ఫ రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టిన నారాయణపూర్‌ గ్రామస్తులు

కొదురుపాక చెరువు నుంచి మట్టి లోడ్‌లతో ఉన్న లారీలు ఇటీవల నారాయణపూర్‌, కొదురు పాక సమ్మక్క ప్రాంగణం మీదుగా వెళుతు న్నాయి. దీంతో ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల తమ ప్రాంతానికి లక్షలు ఖర్చు చేసి కొత్తగా బీటీ రోడ్డు వేశారని, అధిక లోడ్‌తో మట్టి లారీలు వెళితే రోడ్డు దెబ్బతింటుందని గ్రామ స్తులు లారీలను అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా రాళ్లను పెట్టారు.

ఫ మాట మాత్రంగానైనా చెప్పలేదు..

ఉత్తమకుమారి, సర్పంచ్‌ కొదురుపాక

ఇటుక బట్టీల కోసం చెరువు నుంచి మట్టి తరలించే విషయం ఎవరూ చెప్పలేదు. సర్పం చ్‌గా తనకు గౌరవం ఇవ్వలేదు. వాళ్లకు అను మతి ఉన్నా మర్యాద పూర్వకంగా తనకు సమా చారం ఇవ్వలేదు. అందుకే మట్టి తరలింపును అడ్డుకున్నాం.

ఫ పొలం నుంచి లారీలను అనుమతించను

- రైతు కొదురుపాక

కొదురుపాక చెరువు నుంచి మట్టి నింపిన లారీలను టిప్పర్లను నా పొలం నుంచి వెళ్ళని చ్చేది లేదంటూ ఓ రైతు అక్కడ బీష్మించుకున్నాడు. సుల్తానాబాద్‌ ఇటుక బట్టీల యజమానుల లారీలను అనుమతించేందుకు ఒప్పుకున్న సదరు రైతు పెద్దపల్లి ప్రాంత బట్టి వారి లారీలను వెళ్లకుండా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫ గ్రామాభివృద్దికి నిదులు అడిగాం

గ్రామస్తులు

మట్టి తరలిస్తున్న ఇటుక బట్టీల వారు యేటా గ్రామాభివృద్ధి పేరిట కొంత మొత్తాన్ని ఇవ్వడం ఆనవాయితీ. వారు ఇచ్చే నిదులతో గ్రామంలో ప్రజలందరి అవసరాలు తీర్చే విదంగా వాటిని ఖర్చు చేస్తాం. బొడ్రాయితో పాటు గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధి, అలాగే రోడ్డుకోసం కొంత స్థలం కొనుగోలు చేయాల్సి ఉంది.

Updated Date - May 21 , 2026 | 11:42 PM