Share News

కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - May 06 , 2026 | 12:20 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌ విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నందున మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సీడీఎంఏ శ్రీదేవిని కోరారు.

కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించండి
సీడీఎంఎ, ఇతర ఉన్నతాధికారులతో నగర అభివృద్దిపై చర్చిస్తున్న మేయర్‌ శ్రీనివాస్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ కార్పొరేషన్‌ విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్నందున మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సీడీఎంఏ శ్రీదేవిని కోరారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో సీడీఎంఏ శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీడీఎంఎతోపాటు ఉన్నతాధికారులతో కరీంనగర్‌ అభివృద్ధి, స్మార్ట్‌సిటీ పెండింగ్‌ పనులు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో మిగిలిన పనులతోపాటు పట్టణ ప్రగతి పెండింగ్‌ పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో అనేక సమస్యలున్నాయని, మౌళిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరముందని, వాటికి సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పెండింగ్‌ పనులను, బిల్లులను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

Updated Date - May 06 , 2026 | 12:20 AM