Share News

వీధికుక్కలకు నిరంతరాయంగా ఆపరేషన్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:08 AM

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని నగరంలోని వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ తెలిపారు.

వీధికుక్కలకు నిరంతరాయంగా ఆపరేషన్లు

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని నగరంలోని వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జంతు జనన నియంత్రణ (ఏబీసీ) మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో బొమ్మకల్‌ ఏబీసీ సెంటర్‌లో నిర్వహిస్తున్న వీధికుక్కల జనన నియంత్రణ శస్త్ర చికిత్సల పురోగతి, వాటి సంరక్షణ, యాంటీ రేబీస్‌ వ్యాక్సినేషన్‌, కుక్కలకు గుర్తింపు, శస్త్ర చికిత్స అనంతరం వాటిని తిరిగి సంబంధిత ప్రాంతాల్లో వదిలిపెట్టడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధికుక్కల జనన నియ్రంతణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ జె సువార్త, ఏహెచ్‌ వీసీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నరేశ్‌, కేఏకేఏ సెక్రెటరీ డాక్టర్‌ జి కొమురయ్య, వెటర్నరీ ఆఫీసర్‌ దుర్గాప్రసాద్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ సుమన్‌, ఎస్‌పీ సీఏ సుమన్‌, వెటర్నరీ డాక్టర్‌ అనూష, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:08 AM