లక్ష్యాల సాధనకు నిరంతర కృషి
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:01 AM
విద్యార్థులు ఉన్నత లక్ష్యా లను నిర్ధేశించుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సిరిసిల్ల రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఉన్నత లక్ష్యా లను నిర్ధేశించుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సిరిసిల్ల రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన అన్నారు. గురువారం జిల్లా కేంద్రం గీతనగర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సురక్షిత్ బచ్పన్ అభియన్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యం లో విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధంపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు నిర్భ యంగా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పిల్లలకు తక్షణ రక్షణ, న్యాయ సహాయం అందించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలన్నారు. ఆడపిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు దాచకుం డా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే పిల్లల వివరాలు గోప్యంగా ఉంచి వారికి మానసిక ధైర్యం, భరోసా కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం తిరుపతి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, కల్యాణి, కుంట శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.