మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్ సేవల వినియోగం
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:23 PM
జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కోరారు. సిరిసిల్ల పట్టణంలోని పలు మీసేవ కేంద్రాలను బుధవారం సందర్శించి మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ బిక్షపతి మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో కొత్త విద్యుత్ కనెక్షన్ సహా పలు సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకవచ్చిన ట్లు తెలిపారు. వినియోగదారులు ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తిరగడం లేకుండా అన్ని సేవలను ఒకేచోట సులభంగా పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు విద్యుత్‌కు సంబంధించి సేవల కోసం వినియోగదారులు కార్యాల యాలకు వెళ్లాల్సి రావడం వల్ల సమయం, శ్రమ, వ్యయం పెరిగేవని, ఈ కొత్త విధానంతో ఆ ఇబ్బందులు తొలిగిపోతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రెండు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు
జిల్లాలో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడం, వినియోగదారు లకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యంగా జిల్లాలో రూ.7 కోట్ల తో మరో రెండు కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు అయ్యాయ ని, ఎన్‌పీడీసీఎల్ సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి తెలిపారు. జిల్లా లోని తంగళ్ళపల్లి మండలంలోని పాపయ్యపల్లి, గంభీరావుపేట మండలంలోని భీమునిమల్లారెడ్డిపేటలకు 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లు మంజూరయ్యాయ ని తెలిపారు. పాపయ్యపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుతో పాపయ్యపల్లి తోపాటు తాడూరు, గోపాల్‌రావుపల్లె, బెంద్రంపల్లి గ్రామాలకు అనుకూలంగా వి ద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. అలాగే గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామంతోపాటు మల్లారెడ్డిపేట, శ్రీగాధ, కోళ్లమద్దితోపాటు పరిస ర గ్రామాలకు విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని తెలిపారు.