సమన్వయంతో నిర్మాణ పనులు వేగవంతం
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:50 AM
రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల ను సమన్వ యంతో వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశిం చారు.
వేములవాడ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల ను సమన్వ యంతో వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశిం చారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేప ట్టిన రాజన్న ఆలయ విస్తరణ పనులు, నిత్యా న్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులపై ఆరాతీశారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వర కు 80ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను పరిశీలిం చి వేగంవంతం చేయాలని సూచించారు. అధి కారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత సమ యంలో పూర్తిచేయాలన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అభివృద్ధి పనులను నిత్యం క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లా నాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమీషనర్ లోకేష్, వేములవాడ తహశీల్దార్ జయంత్, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయం ముస్తాబు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయం వినాయక చవితి, నవరాత్రోత్సావాల కు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆల యంలో నవరాత్రోత్సవా లు ఘనంగా నిర్వహిం చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చే శారు. ఆలయ ప్రాంగ ణాన్ని, పరిసరాలను వి ద్యుత్ దీపాలు, ప్రత్యేక తోరణాలతో అలంకరి స్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్ర త్యేక ఏర్పాట్లు చేస్తున్నా రు. స్వామివారి విశేష పూజలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
లాకర్ అందజేత
రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి తెలంగా ణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ శాఖ వారు రూ.45వేల విలువైన లాకర్‌ను శుక్రవారం వి రాళంగా అందజేశారు. ఆలయ ఈవో రమాదే వి, పీఆర్వో పెరుక శ్రీనివాస్, అకౌంట్ అడ్వైజర్ ఆగమరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.