Share News

యాక్షన్‌ ప్లాన్‌ ప్రకా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:11 AM

యాక్షన్‌ ప్లాన్‌ ప్రకా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మా ణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

యాక్షన్‌ ప్లాన్‌ ప్రకా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

సిరిసిల్ల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): యాక్షన్‌ ప్లాన్‌ ప్రకా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మా ణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. గురువా రం కలెక్టరేట్‌ నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, వన మహోత్సవంపై గృహనిర్మాణ శాఖ, మున్సిపల్‌ కమిష నర్లు, ఎంపీడీవోలు, అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకు న్నారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన గృహాలు, వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న వివరాలతో పాటు, పూర్తయిన ఇండ్ల వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీ వోలు కలెక్టర్‌కు తెలిపారు. ఇళ్లు లేని పేదల కలలను సాకా రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర మ్మ ఇళ్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తుందని తెలిపా రు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యా ప్తంగా లక్ష్యం మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు. నాటేం దుకు సరిపడా మొక్కల సిద్ధంగా ఉంచాలని, గుంతలు తీసి పెట్టాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.

సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం కోసం భవనాల పరిశీలన

సిరిసిల్ల అర్బన్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మే రకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీంను జిల్లాలోని చేపట్టేందుకు గురువా రం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పలు భవనాలను పరిశీలించా రు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం కింద అల్పాహారం, పాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆహారపదార్థాలు తయా రుచేసేందుకు సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిర్‌తో పాటు వేములవాడలోని పలు భవనాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, హరేకృష్ణ మూమ్మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ బాధ్యులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. తహసీల్దార్‌లు మహేష్‌కుమార్‌రావు, జయంత్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు ఖదీర్‌పాషా, లోకేష్‌లు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని రై తులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు విద్య, వ్యవసాయ, వైద్యాఅరోగ్య తదితర అంశాలపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించా రు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ విద్యార్థుల యూ డైస్‌ నమోదు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో వర్షపాతం, పంటల సాగు, ఎరువులు, విత్తనాల లభ్యతపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీవో లక్ష్మీ నారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ బాబు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమ లత, పలువురు అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:11 AM