రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
ABN , Publish Date - May 18 , 2026 | 12:23 AM
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు.
భగత్‌నగర్, మే 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై ఆదివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ, తమ జేబు సంస్థలుగా తయారు చేస్తూ దేశాన్ని నియంతృత్వం వైపు మోదీ సర్కార్ తీసుకెళుతోందని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులను నొక్కుతోందన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ పెట్టబడిదారులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తెచ్చారని, ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. బిహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు, బెంగాల్ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో గుడికందుల సత్యం. వర్ణ వెంకట్ రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమాసాహెబ్, ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, కంపెల్లి అరవింద్, నరేష్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, వినయ్, భోగేష్, సందేశ్, రాకేష్, సన్ని పాల్గొన్నారు.