బీజేపీ నాయకుడిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:34 AM
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని బీజేపీ నాయకుడు వంగాల రాజురెడ్డిపై కానిస్టేబుల్ షబ్బీర్ పాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆదివారం ఆ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని బీజేపీ నాయకుడు వంగాల రాజురెడ్డిపై కానిస్టేబుల్ షబ్బీర్ పాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆదివారం ఆ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు. ఈ నెల 17న రాత్రి మండల కేంద్రంలోని ఓ ఫ్లెక్సీ దుకాణం వద్దకు చేరుకున్న రాజురెడ్డిపై కానిస్టేబుల్ షబ్బీర్ పాషా దాడి చేయడంతో పాటు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారని నిరసనకు దిగారు. మద్యం మత్తులో ఉండి విధులు నిర్వహించి తమ నాయకుడిపై షబ్బీర్ పాషా చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఎస్ఐ రమేశ్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్న వినిపించుకోలేదు. కేసు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్ నాయకుల వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విచారణ జరిపి శాఖపరమైన చర్యలు చేపడుతామని సీఐ వెంకటేశ్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బుగ్గారెడ్డి, గణేశ్, స్వామి, రంజిత్‌కుమార్, సత్యంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, బాలకృష్ణ, గాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వేడుకకు హాజరైన ప్రముఖులు..
వేములవాడ పట్టణంలోని ఏడు రోజుల సద్దుల బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మూలవాగు తీరం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే కలిసి బెలూన్ ఎగరవేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చి సంబరాల్లో భాగమయ్యారు. పట్టణంలోని పలు వీధుల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలను కలిసి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన వేడుకల్లో గౌరిమాత ప్రత్యేక పూజలో పాల్గొని బతుకమ్మను నిమజ్జనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో సినీ నటులు సాయికుమార్, రామ్జగన్లు మూలవాగులోని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ప్రజాగాయకురాలు, బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్ విమలక్క, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి తదితరులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేములవాడ పట్టణంలోని వాడవాడల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో మూలవాగు తీరానికి తరలిరానున్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ మహేష్ బి గితే నేతృత్వంలో డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్ సీఐ వీరప్రసాద్‌లు ఏర్పాట్లు చేశారు. మూలవాగు తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలేత్తకుండా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.