Share News

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:30 AM

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు చేస్తోం దని, వెంకటేశం హత్య కేసులో కాంగ్రెస్‌ చోటామోటా నాయకులను అరెస్టు చేశారని, వారు పాత్రధారులని, అసలు సూత్రధారులను వదిలి పెట్టబోమ ని, సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా సరే వెలుగులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కే తారకరామారావు పోలీసులను కోరారు.

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

సిరిసిల్ల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు చేస్తోం దని, వెంకటేశం హత్య కేసులో కాంగ్రెస్‌ చోటామోటా నాయకులను అరెస్టు చేశారని, వారు పాత్రధారులని, అసలు సూత్రధారులను వదిలి పెట్టబోమ ని, సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా సరే వెలుగులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కే తారకరామారావు పోలీసులను కోరారు. బుధవారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలో తారక రామానగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆ కుటుంబాన్ని కేటీఆర్‌ పరా మర్శించి భరోసా కల్పించారు. వెంకటేశం కూతురు ప్రసన్న పేరుతో రూ 3 లక్షల బాండ్‌, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస న్న చదువు బాధ్యతలను తాను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంద ర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హత్య ఘటనను రాజకీయ కోణంలో చూడ కుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఇందులో రాజకీయాలు అవస రం లేదని, దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వారిని బయటకు తీసుకురా వాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని, నేరం వెనుక ఎవరు ఉన్నారు.. కుట్ర చేసింది ఎవరు.. నేరానికి పాల్పడింది ఎవరు అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సా గాలని, ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవ రైనా వారిని బయటకు తీసుకురావాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 20ఏళ్లుగా ఉన్నానని,ఇంత దిగజారిన, దరిద్రపుగొట్టు రాజకీయం జీవితంలో ఎన్నడూ చూడలేదని కేటీఆర్‌ అన్నారు. తన తండ్రి కోసం మూడు రోజులు అన్నం తినకుండా చూశానని పాప చెప్తుంటే మనస్సున్న మనిషికి ఎవరికైనా కళ్ళ ల్లో నీళ్లు తిరుగుతాయి,గుండె ద్రవించి పోతుందన్నారు. రాజకీయంగా ఎదు ర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడవచ్చని, నాయకులపై విమర్శలు చేయవచ్చని అన్నారు. ఇప్పుడు చేస్తున్నట్లు కేసులు పెట్టవచ్చు, వేధించవ చ్చని అన్నారు. సామాన్యులను సమిధలుగా, బలిపశువులు చేసి వాళ్ళ జీవి తాలను ఆగంచేస్తే ఏం వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అడుగుతు న్నానని అన్నారు. చనిపోయింది వెంకటేశం అయితే చంపిన వారిలో అరెస్ట్‌ అయిన చోటామోటా నాయకులు అని అన్నారు. అసలు సూత్రధారులు వేరే ఉన్నారని, హత్య వెనుక ఉన్న పెద్దవాళ్లు తప్పించుకున్నారని, వారిని వదిలిపెట్టబోమని అన్నారు. న్యాయం జరిగే వరకూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదుచేసి, ఇద్దరినీ అరెస్ట్‌ చేసి, ముగ్గురికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారని, నేరం, కుట్ర వెనుక ఉన్న పెద్ద వాళ్ళను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను కోరారు. రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఇంత చిల్లర, చిచోర రాజకీయం చూడలేదు. సామాన్యుల ను చంపి రాజకీయ లబ్ధి పొందాలని, చంపడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర రాజకీయం సిరిసిల్ల కాంగ్రెస్‌ నాయకత్వం చేసింద ని, ఇది ఎప్పటికీ క్షమించరాని నేరం, సభ్య సమాజం అసహ్యించుకునే దుర్మార్గ పరిస్థితిగా ఆరోపించారు. ఏదైనా చేసి రాజకీయ లబ్ధి పొందాలని అవసరమైతే మనుషుల ప్రాణాలు మళ్లీ రాజకీయంగా బదునాం చేయాల నే చిల్లర ప్రయత్నంలో భాగంగానే వెంకటేశం లేకుండా పోయాడని ఆవేద న వ్యక్తం చేశారు.

కలెక్టర్‌ అడ్డుగా ఉండొద్దు..

వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంద ని, కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌ నాయ కులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్‌ చెప్పారు. కలెక్టర్‌తో కుటుంబా నికి ఇల్లు మంజూరుచేయాలని చెప్పామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వ లేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఇల్లు నిర్మించి ఇస్తామని, తమ ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పామన్నారు. కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని అన్నారు. వెంకటేశం కుటుంబా నికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వెంక టేశం కుమార్తె ప్రస్తుతం 11ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3లక్షలు డిపాజిట్‌ చేసినట్లు వెల్లడించా రు. ఆమె మేజర్‌ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగ కుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్‌ నాయకులు మంచె శ్రీనివాస్‌, బొల్లి రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:30 AM