ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:26 AM
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. సిరిసిల్లలోని బా బాజీ కాలనీవాసులతో భేటీ అయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. పె ద్దూరు చౌరస్తా, తారకరామనగర్, విద్యానగర్ చౌరస్తా, నేతన్న చౌక్, పద్మనగర్ ప్రాంతాల్లో కార్నర్ సమావేశాల్లో ప్రసంగించారు. సిరిసిల ్లలో ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం పద్మశాలీలను ఎ వరు బెదిరించిన, సమస్యలు వచ్చినా ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. సిరిసిల్లలో మరవ గ్గాలు నడవక ఎన్నో నేతన్నల సావుల జరుగు తుండేవన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రూ. 3400 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని, కార్మికులు రూ.16వేల నుంచి రూ.20 వేల వర కు సంపాదించుకోగలిగారన్నారు. రేవంత్‌రెడ్డి బ తుకమ్మ చీరలు బంద్ చేసి బతుకు తెరువు లే కుండా చేశాడన్నారు. పద్మశాలీలు కేసీఆర్ బతు కమ్మ చీర ఇచ్చాడని చీరల ఆర్డర్లు ఇవ్వమని కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డిని అడి గితే పద్మశాలీలను నిరోద్‌లు, వడియాలు, అప్ప డాలు అమ్ముకోమని మాట్లాడి అవమానపరిచా డన్నారు. నేతన్నల ఆత్మగౌరవాన్ని దె బ్బతీసేలా మా ట్లాడిన కాంగ్రెస్ నేతలకు చెప్పుతో కొట్టినట్లు ఎన్ని కల్లో సమాధానం చెప్పాలని అన్నా రు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఒక్క రూపాయి పని చేయలేదని స్కాములు మాత్రం ఉన్నాయ ని కొత్త స్కీములు లేవన్నారు. బతుకమ్మ చీర లు, కేసీఆర్ కిట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తివేసారని సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లా ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. కేసీఆర్ జిల్లాను ఇచ్చి కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారుల ను తీసుకువచ్చారన్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తంగళ్ళపల్లి బ్రిడ్జి కింద సముద్రం లాగా మార్చాడన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జేఎన్టీయూ, వ్యవసాయ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలు ఇచ్చారన్నారు. ఆపెరల్ పార్క్, నేతన్నలకుు వర్కర్ టు ఓనర్ పథకాన్ని తెచ్చారన్నారు. పద్మశాలీల కోసం రూ 25 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వడంతో పాటు రూ.8 కోట్లతో భవనాన్ని కట్టుకోమని ఇచ్చారని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడి గొం గళి అక్కడే అన్నట్లుగా మారిందన్నారు. మున్సి పల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని లేకుంటే తాము బతుకమ్మ చీర తీసి వేసిన, అవమానించిన, జిల్లా ఎత్తివేసిన ఏమి కాదని ధీమాతో ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మొండి వైఖరిని వీడాలంటే, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే అడ్డుకోకపోతే, ఆ పార్టీ మరింత రెచ్చిపోయి ప్రజలను పీడిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే అవినీతి,అక్రమాలు, స్కాములతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. బీజేపీకి ఓటు వేయ డం అంటే వృథా చేయడమేనన్నారు. ఎన్నికల ముందు కులమతాల పేరుతో ఓట్లు వేయించుకొని, ఒట్టు పెట్టించుకుని పదవులు పొంది మా యమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి సాధించిందేమీ లేదని అన్నారు. గత 12ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని, సిరిసిల్ల నేతన్నలు ఎంతోకాలం గా కోరుతున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకువచ్చే శక్తి ఆ పార్టీకి లేదని విమర్శించారు. బీజేపీ కేవలం కులమత రాజకీయాలకే పరిమిత మైందని ఆరోపించారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే కొద్దిపాటి డబ్బులకు లోబడ కుండా, సిరిసిల్ల గులాబీ కంచుకోటగా మున్సిపల్ ఎన్నికల్లో చూపించాల ని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, చైర్మన్ కొండూరు రవీందర్‌రావు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చీటి నర్సింగ హారావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్‌ప ర్సన్ జిందంకళ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రాంమోహ న్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.