కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెయ్యి రోజుల సంబరాలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:47 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరాచౌక్‌లో శనివారం సంబరాలు నిర్వహించారు.
గణేశ్‌నగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరాచౌక్‌లో శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.