Share News

హల్ద్వానీ ఘటనపై కాంగ్రెస్‌ నిరసన

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:50 AM

హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ (మార్చ్‌), సత్యాగ్రహ దీక్షను చేపట్టారు.

హల్ద్వానీ ఘటనపై కాంగ్రెస్‌ నిరసన

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ (మార్చ్‌), సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి ముందుగా కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ప్లకార్డులతో గాంధీచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈనెల 8న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హల్ద్వానీ రాంలీలా మైదానంలో ఏర్పాటు చే సిన సభలో పాల్గొన్నారన్నారు. ఈనెల 10న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కొందరు రాంలీల మైదానంలో జరిగిన సభా వేదిక మీద పూజలతో శుద్ధి కార్యక్రమాలను చేసి వివక్షను చూపుతూ ఖర్గేను అవమానించడాన్ని ఏఐసీసీ, టీపీసీసీ తీవ్రంగా పరిగణించి దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు, సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చిందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అంటరానితనం, కులవివక్షతను తీసుకురావాలని హిందువు లను విభజించి పాలించాలని వికృత చేష్టలకు పాల్పడుతోం దని ఆరోపించారు. దళితుడిని ఏఐసీసీ అధ్యక్షుడిగా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందని ఖర్గేని బీజేపీ నాయకులు అవమానించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నా రు. బీజేపీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను హరిం చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, వేములవాడ పట్టణ అధ్యక్షుడు మధు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకటస్వా మి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యద ర్శులు రాగుల జగన్‌, మంగ కిరణ్‌, దత్తాత్రేయ, గిరిరెడ్డి, ఉపాధ్య క్షులు గొట్టె రుక్మిణి, కొమరయ్య, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు రాలు కాముని వనితనళినీకాంత్‌, ప్రధానకార్యదర్శి కోడం అరుణ, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్‌, లింగంపల్లి గంగరాజు, మాజీ కౌన్సిల ర్‌ వెంగళలక్ష్మీనర్సయ్య, ఎల్లారెడ్డిపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సబీనబేగం, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, కుమార్‌, నీలి రవీందర్‌, బైరి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:50 AM