ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:50 PM
దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేప ట్టిన అనాలోచిత, అప్రజాస్వామిక చర్యలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేప ట్టిన అనాలోచిత, అప్రజాస్వామిక చర్యలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళ్లు అర్పించారు. అనంతరం చౌరస్తాలో బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిం చగా పోలీసులు రెండుసార్లు అడుకున్నారు. దీంతో జిల్లా అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ పార్ల మెంట్‌లో చర్చించాల్సిన అంశాలను చర్చించకుండా రోడ్డుపై రాజకీయా లు చేయడం ప్రతిపక్ష బాధ్యతకు విరుద్ధమని విమర్శించారు. పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య వేదికను వదిలి రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి దేశంలో అశాంతి, విధ్వంసకర పరిస్థితులు సృష్టించే ప్రయ త్నాలు చేయడం సరైందికాదన్నారు. ఇలాంటి చర్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు జాబ్ మేళాలు, స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతివంటి అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా కరీంనగర్‌లో ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండి పడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందన్నారు. బీజేపీ కార్యకర్తలు రాజ్యాంగాన్ని గౌరవించే సిద్ధాంతంలో పని చేస్తారని, హింసను ప్రోత్స హించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు పునరావృత్తమైతే ప్రజాస్వాయ్యబద్ధంగా, చట్టబద్ధంగా తగిన విధంగా ప్రతిస్పందిం చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్ర మాలకు పోలీసులు ఆంక్షలు విధిస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు దాడు లకు పాల్పడినప్పుడు అదే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిం చారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి చట్టాన్ని అంద రికి సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగులు రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్, ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ నాయక్, ధార్మిక ప్రకోష్ట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అసాని రాంలింగారెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మిరాల్‌కార్ బాలాజీ, రేపాక రామచంద్రం, కోడే రమేష్, లకుపతి నాయక్, సౌల్ల కాంత్రి, బురుగుపల్లి పరమేష్, సెన్సార్ బోర్డు సభ్యురాలు వైశాలి, చింతల్‌ఠాణా సర్పంచ్ గుర్రం అనసూర్య తదిత రులు పాల్గొన్నారు.